Saturday, April 27, 2024
- Advertisement -

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

- Advertisement -

ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ దుబ్బాక లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. అధికార , ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి గ్రామస్థాయిలో నేతలను నియమించి ప్రచారానికి తెరలేపినంత పని చేస్తుంది.. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించింది. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఒక్కొక్క గ్రామానికి ఇన్ ఛార్జిని నియమించి వారికే పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేంత వరకూ వారిదే బాధ్యత. హరీష్ రావు కూడా తన నియోజకవర్గంలో కూడా చేయనంత పోరాటం ఇప్పుడు చేస్తున్నారు.. వాస్తవానికి హరీష్ ఇంత చేయడానికి లేదు. ఎందుకంటే దుబ్బాక లో ఇంకా అధికార పార్టీ వైపే గాలి వీస్తుంది.. పైగా చనిపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎలాగ సింపతీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనభై శాతం గులాబీ పార్టీ కే గెలిచే సూచనలు ఉన్నాయి..

అయితే అధికార పార్టీ కి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక లో విజయ కేతనం ఎగురవేయడానికి ఓ ఎత్తుగడ వేసింది.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఖరారు చేశారు. దాంతో అయన కాంగ్రెస్ లోకి వెళ్లి అక్కడినుంచి పోటీ చేస్తున్నారు.. ఈ క్రమంలో దుబ్బాక కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశించిన నరసింహారెడ్డి, మనోహర్ రావులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా చేరిన చెరకు శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువాను కప్పుకున్నారు. మరి కాంగ్రెస్ దీనికి బదులు ఏం చేస్తుందో చూడాలి..

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతం

బండి సంజయ్ తెలంగాణాలో సక్సెస్ అయినట్లేనా..?

కోదండ రాం ఒంటరిగా వేల్లాల్సిందేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -