Thursday, May 2, 2024
- Advertisement -

మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టిన యూవీ….

- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ త‌న రెండో ఇన్నీంగ్స్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టి20 టోర్నమెంట్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టు తరఫున నిన్న బరిలోకి దిగాడు . అయితే బ్యాటింగ్‌లో నిరాశ ప‌రిచాడు. 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌తో పెవిలియన్‌ చేరాడు. టొరంటో నేషనల్స్‌ జట్టుకు యువరాజ్‌ కెప్టెన్‌గా వ్యహరిస్తుండగా.. ఆ జట్టుపై వాంకోవర్‌ నైట్స్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. బీసీసీఐ నుంచి ప్ర‌త్యేకంగా అనుమ‌తి తీసుకొని కెన‌డాలో జ‌రుగుతున్న గ్లోబల్‌ టి20 టోర్నమెంట్‌లో ఆడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -