Thursday, May 2, 2024
- Advertisement -

లక్షణాలు కనిపించని కొత్త కరోనా వైరస్ వచ్చేసింది..!

- Advertisement -

చైనాలోని వూహాన్ ప్రదేశంలో పుట్టిన ఈ కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటికే ఈ కరోనా కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వైరస్ కు ఇంకా మందు కనుకోలేదు. ఇప్పుడు చైనాలో పరిస్థితులన్నీ కుదుటపడ్డాయి. వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. అయితే తాజాగా మరో ఉపద్రవం వచ్చిపడింది.

కరోనా లక్షణాలైన జలుబు జ్వరం దగ్గు గొంతునొప్పి వంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతుండడంతో చైనాకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయింది. లక్షణాలు ఉన్న కేసులను గుర్తించవచ్చు. కానీ లక్షణాలు లేని వారిని ఎలా గుర్తు పట్టాలో తెలియక చైనా తలపట్టుకుంది. విశాఖపట్నంలోనూ కరోనా లక్షణాలు ఏవీ లేకున్నా వారికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు లేకపోవడంతో తమకేమీ కాలేదని చాలా మంది బయట తిరుగుతూ వందలాది మందికి వైరస్ అంటిస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది.

తాజాగా చైనా సాధారణ కేసులను లక్షణాలు లేకుండా వచ్చిన కరోనా పాజిటివ్ కేసులను వర్గీకరించింది. ఈ తరహా లక్షణాలు బయటపడని కేసుల సంఖ్య దాదాపు 40వేల వరకు ఉండవచ్చని చైనా మీడియా తెలిపింది. చైనా సర్కారు మాత్రం వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఇక ఈ కేసులను చైనా లెక్కల్లో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కరోనా లక్షణాలతో బాధపడుతున్న లక్షలమందికి చికిత్స చేయలేక వైద్యులు సతమతమవుతుంటే.. ఇలా లక్షణాలు లేనివారితో మరింత ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -