Thursday, May 9, 2024
- Advertisement -

BREAKING NEWS: మొదటి సారిగా మెట్రోలో గుండె తరలింపు!

- Advertisement -

మనిషి ప్రాణం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏదైనా అనారోగ్యం ఏర్పడినా.. ప్రమాదాలు జరిగినా చివరి వరకు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతారు. ఈ సమయంలో కొంత మందికి అవయవదానాల వల్ల ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. సాధారణంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత ఎంతో మంది ప్రాణాపాయాల నుంచి బయట పడ్డారు. గుండెను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించి బాధితులకు అమర్చి బతికిస్తున్నారు.

తాజాగా బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఎల్బీ నగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి విజయవంతంగా తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన 45 ఏళ్ల వలకాతం నర్సిరెడ్డి. పట్టణానికి చెందిన నర్సిరెడ్డి 15 ఏళ్లుగా బోరుబండిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నర్సిరెడ్డికి అకస్మాత్తుగా బీపీ పెరగటం… అస్వస్థతకు గురవటం.. చికిత్స నిమిత్తం హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు.

ఆ తర్వాత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినా.. ఫలితం దక్కలేదు. బ్రెయిన్​ డెడ్ అయ్యిందని.. నర్సిరెడ్డి ఇక బతకడని.. అతడి కుటుంబసభ్యులకు వైద్యులు వెల్లడించారు. వైద్యుల నుంచి ఊహించని మాట విన్న ఆ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ సమయంలోనే గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు.

గుండెను కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు రోడ్డుమార్గంలో.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో తీసుకెళ్లారు.తొలిసారిగా గ్రీన్‌ఛానల్‌ ద్వారా మెట్రో రైలులో గుండెను తరలించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ నుంచి అపోలో ఆస్పత్రి వరకు మళ్లీ రోడ్డుమార్గంలో తీసుకెళ్లారు. మొదటిసారిగా నగరంలో మెట్రోలో తరలించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

మిస్టర్‌ కూల్‌ ధోనీ చరిత్ర సృష్టించాడు.

నోరు జారిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆపై క్షమాపణలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -