Friday, March 29, 2024
- Advertisement -

ఈ సింపుల్ చిట్కాలతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి !

- Advertisement -

ఎండాకాలం రాకతో బానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక ఈ ఎండతాపాన్ని తాలలేక జనాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడుతూ ఎండ తీవ్రతనుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఏసీల వాడకంతో చాలా మంది భారీమొత్తంలో కరెంటు బిల్లు బాదుడును ఎదుర్కొంటున్నారు. భారీ మొత్తంలో కరెంటు బిల్లును పొందడమే కాకుండా.. ఏసీల సామర్థ్యం కూడా తగ్గిపోతూ వుంటుంది.

ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది చిట్కాలను పాటించాల్సిందే. ఏసీని ఉపయోగించే ముందు రూంలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులేవీ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఏసీ ఆన్ చేసేముందు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్ లో ఉండకూడదు. రూమ్ చల్లబడిన తర్వాత వాటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఏసీలను క్లీన్ చేస్తూ ఉండాలి. దుమ్ము ధూళీ పడితే ఏసీలు తొందరగా రిపేర్ అయ్యే అవకాశం ఉంది.

సో ఏసీల ఫిల్టర్ ను తరచుగా చెక్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఏసీలు బాగా పనిచేయడంతో పాటుగా 5 నుంచి 15 శాతం విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇకపోతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసే ఏసీని ఆన్ చెయ్యాలి. ఇలా చేస్తే రూం తొందరగా చల్లబడుతుంది. ముఖ్యంగా రోజంతా ఏసీని వేసినప్పుడు రాత్రి కేవలం 2 గంటల పాటు ఏసీని వేస్తే చాలు రూం అంతా చల్లగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అయ్యి కరెంట్ బిల్లు బాదుడు ఉండదు.

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -