Tuesday, April 30, 2024
- Advertisement -

కౌంటర్.. ఎన్ కౌంటర్

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరుపై పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలు తెలంగాణలో రాజకీయ వేడిని రగిల్చాయి. కొంత కాలంగా బీజేపీపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ ఎస్ మరింత తీవ్రంగా విమర్శించాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని దిష్టి బొమ్మలను పెద్ద ఎత్తున దహనం చేసింది. మోదీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని , భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కారు పార్టీ డిమాండ్ చేస్తున్నది. మౌన దీక్షల పేరుతో కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన తెలిపింది.

దీనిపై బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేమిటో చెప్పాలని డిమాండ్ చేసింది. టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ కు అధికార ప్రతినిధిగా మారిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు ఉన్న లోపాయి కారీ పొత్తు బయటపడిందని ఎద్దేవా చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -