శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై కార్యకర్త తిరుగుబాటు జెండా ఎగరవేశారు.బహిరంగ చర్చకు సిద్ధమా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బుకు కక్కుర్తిపడి టీడీపీ నేతలు, కార్యకర్తలను స్వయంగా ఎమ్మెల్యే అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియో విడుదల చేశారు గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్.
ఎమ్మెల్యే బహిరంగ చర్చకు వస్తే అన్ని అరాచకాలు బయటపెడుతానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా లో ప్రసాద్ వీడియో వైరల్‌గా మారగా ఇటీవల కనుంపల్లి గ్రామంలో పర్యటించారు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి. ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్త ప్రసాద్, అతని కుటుంబ సభ్యులను ఈడ్చుకెళ్లారు పోలీసులు.
