Monday, May 6, 2024
- Advertisement -

పెథాయ్ దెబ్బ‌కు గింగిరాలు తిరుగుతున్న స‌ముద్రం

- Advertisement -

పెథాయ్ తుపాన్ ఏపీని వ‌ణికిస్తుంది.కాకినాడకు పశ్చిమ ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 196 కిలోమీటర్ల దూరంలో ఇది తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం తుని–యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పెథాయ్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్ల‌డించింది.పెథాయ్‌ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 110 కిలోమీటర్ల స్థాయికి కూడా చేరుకుంటాయని ఐఎండీ ప్రకటించింది. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.పెథాయ్‌ తీవ్ర తుపానుగా మారుతుందని, కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -