Tuesday, April 30, 2024
- Advertisement -

ఛ‌త్తీస్ గ‌డ్‌లో భారీ ఎన్ కౌంట‌ర్‌…ప‌ది మంది మావోయిస్టులు మృతి

- Advertisement -

ఛ‌త్తీస్ గ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో మావోల‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. పోలీసులు, మావోల ఎదురు కాల్పుల్లో ప‌ది మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం బీజపూర్ జిల్లా, జైరామ్‌గఢ్ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఇంకా అక్క‌డ ఎదురు కాల్పులు జ‌రుతున్న‌ట్లు సమాచారం.

బీజాపూర్‌‌లోని బైరామ్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతాబలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో 11 ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎన్‌కౌంట‌ర్‌ను బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ ధృవీకరించారు.

కేంద్రప్రభుత్వం మావోల కార్య‌క‌లాపాల‌ను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు నిర్వహించడంతోపాటు, జనవరి 31న బంద్‌కు పిలుపు కూడా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగానే మావోయిస్టులపై పూర్తిగా నిఘా పెట్టిన పోలీసులు. ఈ సంద‌ర్భంలోనే ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని…మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -