Saturday, April 27, 2024
- Advertisement -

అక్కడ 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్!

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత నెలలో వేల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు లక్షలకు చేరాయి. కరోనా ప్రభావంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు వృద్దులకు కరోనా టీకా వేశారు. ఇప్పుడు 40 ఏళ్లకు పై బడిన వారికి కరోనా టీకా ఇస్తున్నారు.

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి పలు చర్యలు చేపట్టింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ టీకాకు దూరం కావొద్దని భావించిన కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 18 ఏళ్లు పైబడని వారందరికీ ఉచితంగా టీకా అందిస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కార్యాలయం బుధవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని తెలిపింది. మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

హీరో తేజ సజ్జ ‘ఇష్క్​’విడుదల వాయిదా!

గుడ్ న్యూస్ : వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు!

కరోనా విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -