Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జీవితం అంటే ఇదేనా…?

- Advertisement -

ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు తెర దైవం శ్రీ నంద‌మూరి తార‌క రామారావు జీవితం అనేది తెరిచిన పుస్తకం వంటిది. మ‌రి అలాంటి ఆయ‌న జీవితాన్ని సినిమాగా తీయ‌డానికి అనేక మంది రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. వారిలో ఒక‌రు ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ‌. త‌న తండ్రి జీవితాన్ని రెండు పార్ట్‌లుగా విభ‌జించి సినిమాను నిర్మించాడు బాల‌య్య‌. మొద‌టి పార్ట్‌లో ఎన్టీఆర్ సినీ విశేషాల‌ను చెప్పాగా , రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ రాజ‌కీయం గురించి చూపించారు. అయితే భారీ అంచాన‌ల మ‌ధ్య విడుద‌లైన మొద‌టి పార్ట్ ఫ్లాప్ కావ‌డంతో రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడుపై ఎవ్వ‌రికి పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా పోయ్యాయి.

దీనికి కారణం కూడా బాల‌య్యే అని చెప్పాలి. ఎప్పుడు అయిన బ‌యోపిక్‌లు అంటే మంచి , చెడు రెండు చూపించాలి. అల‌నాటి న‌టి సావిత్రి బ‌యోపిక్‌లో కూడా సావిత్రి గురించి నెగిటివ్‌గా చూపించారు. ఆమె మ‌ద్యానికి బ‌నిస‌గా మారి సినిమా కెరీర్‌ను పాడు చేసుకున్న‌ట్లుగా మ‌హ‌న‌టిలో చూపించ‌డం జ‌రిగింది. కాని ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ అంత గొప్ప వ్య‌క్తి మ‌రోక‌రు లేరంటూ చూపించారు. నిజానికి ఎన్టీఆర్ గొప్ప న‌టుడు, గొప్ప ముఖ్య‌మంత్రి అన‌డంలో ఎవ్వ‌రికి అనుమానాలు లేవు. కాని ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త‌నికి వ‌స్తే ఎన్టీఆర్ కోపిష్టి అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఎవ్వ‌రి మాట విన‌ని వ్య‌క్తి అని ఆయ‌న‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వారు చెబుతుంటారు.

అలాగే ఆయ‌న రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా కొన్ని అనోలిచిత నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే సినిమాలో ఇవి ఏవి చూపించ‌లేదు. త‌న తండ్రి సినిమా , నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు తీస‌కుంటాను అంటే క‌థానాయ‌కుడు జ‌రిగినే న‌ష్ట‌మే మ‌హ‌నాయ‌కుడుకి కూడా జ‌రుగుతుంది. మ‌హ‌నాయ‌కుడులో ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్క‌ర‌రావు వెన్నుపోటు పోడ‌వ‌డం వ‌ర‌కే చూపించారు. మ‌రి సొంత మామ‌కు వెన్నుపోటుగా పోడిచిన చంద్ర‌బాబు గురించి ఎందుకు చూపించ‌లేద‌నది అంద‌రికి తెలిసిన ర‌హ‌స్య‌మే. ఎన్టీఆరే స్వయంగా చంద్ర‌బాబు ఎంత‌టి నీచుడో చెప్పిన వీడియోలు ఇప్ప‌టికి యూట్యూబ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇక త‌న తండ్రి రెండో పెళ్లి గురించి కూడా ఈ బ‌యోపిక్‌లో చూపించ‌లేదు. అస‌లు ల‌క్ష్మి పార్వతి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచే ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు వ‌చ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కాని ఈ పాయింట్‌ను కూడా ఒదిలేశారు.

ఇవేమి సినిమాలో చూపించ‌కుండా త‌న తండ్రి అంత గొప్పవాడు మ‌రోక‌రు లేరంటూ మీ డ‌బ్బా మీరే కొట్టుకుంటే ఎలా అని ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుడు కూడా ప్ర‌శ్నిస్తున్నాడు. మొత్త‌నికి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఎన్టీఆర్ జీవితాన్ని తెర మీద పూర్తిగా ఆవిష్క‌రించ‌లేద‌నేది అక్ష‌ర స‌త్యం. మ‌రి వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో అయిన ఎన్టీఆర్ జీవితాన్ని పూర్తిగా చూపిస్తారో లేదో చూడాలి. ప్ర‌స్తుతనికి అయితే ఎన్టీఆర్ జీవితం వెండితెర మీద తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -