Tuesday, April 30, 2024
- Advertisement -

పాక్ యూట‌ర్న్ తీసుకుంది…త్రివిధ దళాలు

- Advertisement -

పాకిస్థాన్ రెచ్చ‌గొడితే బుద్దిచెప్పేందుకు ఆర్మీ సిద్దంగా ఉంద‌ని త్రివిధ ద‌ళాధిప‌తులు తెలిపారు. ఉగ్ర‌స్థావ‌రాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేశామ‌ని…కాని పాక్ మాత్రం సైనిక స్థావ‌రాల‌ను టార్గెట్ చేసింద‌న్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో త్రివిధ ద‌ళాధిప‌తులు మీడియా ముందు మ‌ట్లాడారు. ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పది గంటలకు పాక్ విమానాలు మన భూభాగంలోకి చొరబడటాన్ని గమనించామని, వెంటనే భారతీయ వైమానిక దళం స్పందించిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ కపూర్ పేర్కొన్నారు.

ఎఫ్ -16 యుద్ధవిమానాలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వాటినుంచి ఉపయోగించిన క్షిపణులను కూల్చివేశామని వారు తెలిపారు. క్షిపణుల శకలాలను మీడియా ముందు ఉంచారు. పాక్ సమాచారాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు. పాక్ విమానాలు భార‌త భూబాగంలోకి వ‌చ్చాయ‌ని వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన వాయుసేన మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయని, తమ దాడిలో పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాయని అన్నారు.ఎప్-16 విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిందని, ఈ ఆపరేషన్ లో భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-21ను కోల్పోయామని చెప్పారు.

వైమానిక దాడులపై పాకిస్థాన్ పలుసార్లు మాట మార్చిందన్నారు. ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మొద‌ట రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లు కూల్చామ‌ని ముందు చెప్పిన పాక్ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకుంద‌న్నారు. బుధవారం సాయంత్రం ఒక్క పైలెట్ మాత్రమే పట్టుబడ్డాడని అంగీకరించింద‌న్నారు.

ఎఫ్-16 విమానాలను ఉప‌యోగిచ‌లేద‌ని పాక్ క‌ట్టు క‌థ‌లు చెప్తోంద‌ని … అందుకు సాక్ష్యాలున్నాయ‌న్నారు. పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్-16ను భారత వాయుసేన కూల్చి వేసింది. వింగ్ కమాండర్ అభినంద్ తిరిగొస్తుండటం పట్ల ఆనందంగా ఉంది’ అని ఎయిర్‌ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు. భారత్ రెండు విమానాలు కూల్చినా… పైలట్లు సురక్షితంగా దిగారని తెలిపారు. అడ్డుకోవటం వల్లే భారత్ ఆర్మీ స్థావరాలపై బాంబులు వేయలేక పోయారని తెలిపారు.

గగనతలంలో ఏ దేశం విమానం వెళ్తుందో గుర్తించే సాంకేతికత తమ వద్ద ఉందని, భారత వైమానిక దళం అన్ని వేళలా సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తాము అనుకున్న ల‌క్ష్యాన్ని 100 శాతం పూర్తి చేశామ‌ని..ఎంత మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయింద‌నే స‌మాచారం లేద‌న్నారు. ఎల్వోసీ వెంబడి పధాతి దళాలు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాయని, దేశ రక్షణకు, ఈ ప్రాంత పరిరక్షణకు ఆర్మీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆధీన రేఖ వెంబడి భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు.



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -