Tuesday, April 30, 2024
- Advertisement -

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్ తో మ్యాచ్‌పై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

- Advertisement -

వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంద‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ వ‌రల్డ్ క‌ప్‌లో ఒత్తిడిని అధిగ మించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు.ఫిట్‌నెస్‌ పరంగా భారత జట్టు బలంగా ఉందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుండగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీతో పాటు జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వరల్డ్‌కప్‌ సన్నద్ధత వివరాలను వెల్లడించారు.

తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదన్న కోహ్లి.. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నాడు. ఈ వరల్డ్‌కప్‌కు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు కోహ్లి తెలిపాడు. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉందని, మెరుగైన ప్రదర్శన చేయడమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టామన్న కోహ్లి.. ఐపీఎల్ సమయంలోనూ తమ బౌలర్లు 50 ఓవర్ల క్రికెట్ కోసం సన్నద్ధమయ్యారని తెలిపాడు.

మా బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అందరూ తాజాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎవరూ బలహీనంగా లేరు. డే-నైట్‌ మ్యాచ్‌ లేదా డే మ్యాచ్‌ అనేది పెద్ద విషయం కాదు. మంచి క్రికెట్‌ ఆడాలన్నదానిపైనే మా దృష్టి అంతా అని వివ‌రించారు. కుల్దీప్, చహల్ వరల్డ్ కప్‌లో రెండు స్తంభాలంటూ స్పిన్ ద్వయంపై కెప్టెన్ ప్రశంసలు గుప్పించాడు. కేదార్ జాదవ్ గాయడం విషయమై ఆందోళన చెందడం లేదన్నారు. ఒత్తిడిని అధిగమించిన జట్టే వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలదన్నాడు. ఇక్కడ ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లి తెలిపాడు. వరల్డ్ కప్‌లో ఎంఎస్‌ ధోని కీలక పాత్ర పోషిస్తాడని కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -