Tuesday, April 30, 2024
- Advertisement -

టీమిండియాకు షాక్ ….కోహ్లీకి గాయం

- Advertisement -

ప్రపంచకప్‌ 2019లో తొలి మ్యాచ్ ఆడకముందే భారత్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. 5వ తేదీన దక్షిణాఫ్రికాతో.. టీమిండియా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే కెప్టెన్ కోహ్లీ చేతికి గాయం అవ‌డంతో అత‌ను మొద‌టి మ్యాచ్ లో ఆడ‌టం అనుమానంగానె ఉంది. శనివారం ఏజెస్‌ బౌల్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా జట్టు కీలక బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కుడి చేతి బొటన వేలికి బంతి బలంగా తగిలింది. దాంతో ప్రాక్టీస్ సెషన్ నుంచి అతను వైదొలిగాడట. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడా.. లేదా బ్యాటింగ్ చేస్తుండగా గాయమైందా అనేది తెలియాల్సి ఉంది. ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ వెంటనే కోహ్లి వేలిపై స్ప్రే చేసి, టేప్‌ చుట్టాడు. తర్వాత అతడు నెట్స్‌ నుంచి బయటకు వచ్చి వేలును ఐస్‌ వాటర్‌లో ఉంచాడు. కోహ్లీ గాయంపై పెద్ద‌గా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం ల‌దేని చెబుతున్నా మొద‌టి మ్యాచ్‌కు మాత్రం అనుమానంగానె ఉంది.

ప్రస్తుతం కోహ్లీ చేతికి అయ్యే గాయాన్ని డాక్టర్లు పరిశీలించి చికిత్స చేస్తున్నారు. గాయంతో బాధపడుతున్న కోహ్లీ… దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఆడతాడా? లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జట్టు మేనేజ్ మెంట్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. మ‌రో వైపు కోహ్లీ అభిమానులు మాత్రం త్వ‌ర‌గా కోలుకోవాలంటూ మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ట్వీట్‌లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -