Thursday, May 2, 2024
- Advertisement -

అవసరం అయితే అణ్వాయుధమే….పాక్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ వార్నింగ్

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత యుద్ధానికి కాలు దువ్వుతున్న పాక్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం పాక్ అధ్యక్షుడు, ప్రధాని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో ఎందాకైనావెల్తామని అవసరం అనుకుంటే యుద్ధం కూడా తప్పదని ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఉద్రిక్తతలను పెంచే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లడక్ సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను మోహరించిన సంగతి తెలిసిందే.

అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతమని… అవసరమైతే ఈ విధాన్ని భవిష్యత్తులో మార్చేసే అవకాశాలుంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు.

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్ లో రాజ్ నాథ్ నివాళి అర్పించారు. పోఖ్రాన్ లోనే భారత్ రెండు అణు పరీక్షలను (1974, 1998 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -