స్టార్ హీరోల చేతల మీదుగా ట్రైలర్ విడుదల

- Advertisement -

26/11 ముంబై దాడులతో దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. రక్త పాతం సృష్టించేందుకు వచ్చిన ఉగ్రవాదులతో పోరాడుతూ ఎందరో అమరవీరులయ్యారు. అలా వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. సందీప్ ఉన్ని కృష్ణన్ గా ప్రధాన పాత్రలో అడవి శేషు కనిపించబోతున్నారు.

శశికిరణ్ డైరెక్షన్‌తో పాన్ ఇండియా మూవీగా జూన్ ౩న విడుదలకు సిద్ధమవుతోంది. శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -

ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో ట్రైలర్లు విడుదల చేశారు. తెలుగులో మహేశ్‌బాబు ట్రైలర్ రిలీజ్ చేయగా.. హిందీలో సల్మాన్‌ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ చేతుల మీదుగా విడుదలైంది. ఉగ్రవాదులతో ఉన్ని కృష్ణన్ పోరాటాన్ని ఈ ట్రైలర్‌లో కళ్లకు కట్టారు.

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో

చిరంజీవితో రాధిక మూవీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -