Tuesday, May 7, 2024
- Advertisement -

హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌రువాత అన్నద‌మ్ముల మ‌ధ్య మాటలు లేవా..?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా న‌టిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నా ఈ సినిమాను చినబాబు నిర్మించిన ఈ చిత్రం ద‌స‌రాకు కానుక‌గా ఈ నెల 11న విడుదలవుతోంది. నిన్న(మంగ‌ళ‌వారం) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి అభిమానుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ చాలా ఎమోష‌నల్‌గా మాట్లాడాడు.ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలు ఏ దర్శకుడూ నాకు పెట్టలేదు. కానీ, ఈ చిత్రంలో అది యాధృచ్చికమో, అలా జరిగిందో తెలీదు.. మనం అనుకునేది ఒకటి.. పైనవాడు రాసేది ఇంకోటి అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంతో చెప్పిన‌ మాటలు అక్క‌డి ఉన్నవారిని సైతం క‌న్నీరు పెట్టించింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ చెప్పిన మాట‌లు అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగించాయి.

త‌న తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణించిన త‌రువాత త‌న అన్న క‌ల్యాణ్ రామ్ నేను మాట్లాడుకోలేద‌ని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌.దీనికి గ‌ల కార‌ణం కూడా వివ‌రించాడు ఎన్టీఆర్‌. మనిషి బతికున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయాక విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. నాన్నగారు బతికున్నంతవరకూ.. ‘నాన్నా.. మనం ఏదో చాలా గొప్పో అని కాదు. ఓ మహానుభావుడి కడుపున నేను పుట్టాను.. నా కడుపున మీరు పుట్టారు. బతికున్నంతవరకూ అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకోసం ఏమీ చేయకపోయినా వాళ్లు మన కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు’ అని ఎన్నిసార్లు అన్నారో నాకు తెలుసు. నాన్న ఉనప్పుడు ఆయ‌న విలువ తెలియ‌దు,చ‌నిపోయిన త‌రువాత ఆయ‌న విలువ ఏంటో తెలుస్తుంది.నాన్న లేని నాకు అన్న క‌ల్యాణ్ రామే నాన్న అని పెర్కొన్నాడు తార‌క్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -