Friday, May 3, 2024
- Advertisement -

బాగా పడిపోయిన నాగార్జున మార్కెట్

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆంధ్ర లోని కృష్ణా మరియు వైజాగ్ ప్రాంతాలలో ఈ సినిమా నిర్మాతలు స్వయంగా విడుదల చేస్తుండగా, మిగతా ఏరియాస్ లో సినిమాని 7కోట్ల రేషియో కి అమ్మ కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ శర్వానంద్, విజయ్ దేవరకొండ వంటి యువ హీరోలకు పదికోట్ల రేషియో తీసుకుంటున్న ఈ సమయంలో నాగార్జునకి కేవలం ఏడు కోట్లు రేషియో అంటే చాలా తక్కువ అని తెలుస్తోంది. అయితే ‘మన్మధుడు’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, చిత్ర టీజర్ మరియు ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇదిలా ఉండగా నాగార్జున ఈ విషయమై మాట్లాడుతూ తాము కావాలని బయ్యర్లకు చాలా తక్కువ రేట్లకు అమ్మినట్లు తెలిపారు. నిర్మాతలు మాత్రమే కాక బయ్యర్లు కూడా బాగుండాలని ఇలా చేశామని చెప్పుకొచ్చారు నాగార్జున. నాగ్ చెప్పిన మాటలలో కూడా నిజముంది. ఎందుకంటే బయ్యర్లకు ఎక్కువ రేట్లకు సినిమాలు అమ్మేసి సినిమా డిజాస్టర్ అయితే బయ్యర్లు మునిగి పోయారు అని టాక్ తెచ్చుకోవడం కంటే సినిమా యావరేజ్ గా ఉన్నా తక్కువ రేట్ కి అమ్మితే బయర్లకి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. మళ్లీ బయ్యర్లకు లాసులు వచ్చాయని నిర్మాతలు దానిని భర్తీ చేయడానికి తలనొప్పి తెచ్చుకోవడం కంటే ఈ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అవుతుంది. మరోవైపు ‘మన్మధుడు 2’ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -