ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..

- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎఫ్ -2 కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్-3” సినిమా విడుదలను వాయిదా వేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాలో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు.

ఈ మూవీలో కొత్తగా సునీల్ .. అంజలి పాత్రలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కొంతవరకూ చిత్రీకరణ జరిపారు. ఈ లోగా కరోనా విజృంభించడంతో, షూటింగును వాయిదా వేశారు. ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే పనులను పూర్తిచేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు.

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో చెబుతామని అన్నాడు.

కేరళాలో సంపూర్ణ లాక్ డౌన్!

కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాలి : సీఎం జగన్

పవన్ కళ్యాణ్ కోరిక విని షాక్ అయిన మెగాస్టార్?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -