స్పెషల్​ సాంగ్​కోసం సన్నీ లియోన్​ రెమ్యునరేషన్​ ఎంతంటే?

సుకుమార్​ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కథపరంగా, సన్నివేశాల పరంగా సుకుమార్​ ఎంతో విభిన్నంగా ఆలోచిస్తాడన్న విషయం తెలిసిందే. ఆయన చిత్రాల్లో ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక తాజాగా సుకుమార్​ .. అల్లు అర్జున్​ కాంబినేషన్​లో పుష్ప చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్​ఇండియా కేటగిరిలో రాబోతున్నది. గతంలో వీరి కాంబినేషన్​లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 ఎంతో సక్సెస్​ అయిన విషయం తెలిసిందే.

గంగోత్రితో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్​..ఆర్యతోనే నటుడిగా నిరూపించుకున్నాడు. స్టైలిష్​ స్టార్​గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం పుష్ప చిత్రం ద్వారా పాన్​ ఇండియా హీరోగా రాణించాలని ఆశపడుతున్నాడు బన్నీ. ఇప్పటికే బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్​ ఉంది. ఇక సుకుమార్​ చిత్రాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి కాబట్టి.. పాన్​ ఇండియా లెవల్​లో ఈ చిత్రాలకు మార్కెట్​ ఉండే చాన్స్​ ఉంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో బాలీవుడ్​ శృంగార తార సన్నీ లియోన్​తో స్పెషల్​ సాంగ్​ చేయబోతున్నారు. ఇందుకు సన్నీ కూడా ఒప్పుకుందట. అయితే ఈ ఒక్క పాట కోసమే సన్నీ లియోన్​ రూ. 90 లక్షలు డిమాండ్​ చేసిందని టాక్​.

సన్నీ లియోన్​కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్​ ఉంటుంది. దీంతో ఆమెకు అడిగినంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్​ ఒప్పుకున్నారట. ఈ పాట కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయట. పుష్ప చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్​గా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక గిరిజన యువతిగా కనిపించబోతున్నది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్​ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అర్జున్​ లారీ డ్రైవర్​గా మాస్​ లుక్​తో కనిపించనున్నాడు.

Also Read

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఏకే ‘ షూట్ మళ్లీ మొదలు..!

త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?

Related Articles

Most Populer

Recent Posts