Tuesday, May 7, 2024
- Advertisement -

భరత్ అను నేను…… వైఎస్‌ల హీరోయిజం ఎలివేట్ చేస్తుందా?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీని తన క్రేజ్ కోసం వాడుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. స్వయంగా సినిమా హీరో అయిన ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ సినిమా వాళ్ళను చంద్రబాబు స్థాయిలో వాడుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన చిత్తానికి వాడేస్తూ ఉంటాడు. ఇక ఒక వర్గం సినిమా జనాలు కూడా కులాభిమానంతో ప్రత్యక్ష్యంగానో….పరోక్షంగానో చంద్రబాబుకు సాయం చేస్తూ ఉంటారు. కృష్ణం వందే జగద్గురుం సాంగ్, నేనే రాజు నేనే మంత్రిలాంటి సినిమాలతో పాటు బాలయ్య సినిమాలను కూడా టిడిపి జనాలందరూ జగన్‌కి వ్యతిరేక ప్రచారం కోసం వాడుకుంటూ ఉంటారు.

అయితే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అను నేను’ అనే సినిమా విషయంలో మాత్రం టిడిపి బ్యాచ్ అంతా గరం గరంగా ఉన్నారు. ‘ఇచ్చిన మాట తప్పితే మనిషే కాదు’ అనే రేంజ్‌లో ట్రైలర్‌లో ఉన్న డైలాగే బాబు అండ్ కోని వణికించింది. ఆ వెంటనే అలర్ట్ అయిపోయి కొరటాలపై ఒత్తిడి తెచ్చి ఇష్యూని మోడీ పైకి డైవర్ట్ చేశారు. కానీ 2014ఎన్నికల సమయంలో ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు అన్ని హామీల విషయంలోనూ మాట తప్పాడన్నది కంటికి కనిపిస్తున్న నిజం. ఇక మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే అని ప్రచారం చేసిన చంద్రబాబు రైతులను ఎంతగా దగా చేశాడో చెప్పనవసరం లేదు. ఉచిత విద్యుత్ ఫైలుపైనే మొదటి సంతకం అని చెప్పి నిజాయితీగా హామీని నిలబెట్టుకున్న వైఎస్సార్ మొదటి సంతకానికి తెచ్చిన విశ్వసనీయతను కూడా చంద్రబాబు పోగొట్టేశాడు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైఎస్‌లకు ఉన్న విశ్వసనీయత గురించి తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. అందుకే భరత్ అనే నేను సినిమా టీజర్ వైఎస్‌ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తే ….చంద్రబాబుతో పాటు ఆయన అభిమానులకు కూడా ఆవేధన మిగిల్చింది.

ఇక తాజాగా పంచెకట్టు, తలపాగాతో ఉన్న మహేష్ బాబు స్టిల్స్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు లుక్ చూసిన వెంటనే తెలుగు వాళ్ళందరికీ కూడా వైఎస్సార్ గుర్తుకు వచ్చిన పరిస్థితి. అందుకే ఇప్పుడు చంద్రబాబు అండ్ కో అందరూ కొరటాలపై గరం గరంగా ఉన్నారు. భరత్ అను నేను సినిమాలో అధికారంలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఇంకా కూడా కొన్ని డైలాగులు ఉన్నాయని……అవన్నీ కూడా చంద్రబాబుకే సూటిగా తగిలేలా ఉన్నాయన్నది యూనిట్ వర్గాలు చెప్తున్న మాట. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే మాత్రం పచ్చ బ్యాచ్ అంతా కూడా కొరటాలపై విరుచుకుపడడం ఖాయం. 2019 ఎన్నికలకు పవన్ సొంత ప్రయత్నాల్లో ఉన్నాడు అని ఉప్పందిన వెంటనే మహేష్ కత్తి, పూనం కౌర్ ఎపిసోడ్‌తో అజ్ఙాతవాసి విషయంలో కూడా విష ప్రచారం సాగించినట్టుగా ఈ భరత్ అను నేను పై కూడా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ ప్రచారం వెల్లువెత్తేలా చేయడం ఖాయం. ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే మాత్రం భరత్ అను నేను సినిమా ఎక్కడ వైఎస్‌లకు ప్లస్ అవుతుందో…..చంద్రబాబుకు ఏం నష్టం చేస్తుందో అన్న ఆలోచన మాత్రం టిడిపి నాయకుల మెదళ్ళను కూడా తొలిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -