Tuesday, May 7, 2024
- Advertisement -

వచ్చాడయ్యో స్వామి…… సాంగ్‌కి ఇన్‌స్పిరేషన్ జగన్ పాదయాత్రనా?

- Advertisement -

పోసాని కృష్ణ మురళి ముక్కుసూటితనం, మంచితనం, నిజాయితీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు. అలాగే సమాజం గురించి కూడా గొప్పగా ఆలోచిస్తాడు పోసాని. స్వయంగా తను కమ్మ కులస్థుడే అయినప్పటికీ చాలా మందిలాగా కులం కోసమో, కుంచిత మనస్తత్వంతోనో ఆలోచించే టైప్ కాదు పోసాని. ఆ విషయాన్ని పోసానినే చాలా సార్లు చెప్పుకున్నాడు. ఇక పోసానికి సన్నిహిత బంధువు అయిన కొరటాలకు కూడా సామాజిక బాధ్యత చాలా ఎక్కువ. సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాడు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలలో ఆ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు తాజాగా భరత్ అను నేను సినిమా కోసం కొరటాల శివ రిలీజ్ చేసిన ‘వచ్చాడయ్యో సామీ….’ సాంగ్ విన్నవెంటనే చాలా మంది తెలుగువాళ్ళకు వైఎస్ జగనే గుర్తొచ్చాడు. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు ఆశగా, ఆనందంగా వైఎస్ వైపు చూసేవాళ్ళు. ఎక్కడా కూడా మీడియా కోసం ఫోజులు, పబ్లిసిటీ స్టంట్స్ ఉండవు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా సేం టు సేం. అవ్వతాతల నుంచి చిన్న పిల్లల వరకూ ప్రజలతో కలిసిపోయే విషయంలో నాటకీయత ఉండదు. అలాగే మాట మీద నిలబడే నైజం, విశ్వసనీయత కూడా వైఎస్‌లకు చాలా ఎక్కువ. అందుకే వైఎస్ జగన్ ఇచ్చే హామీలు, చెప్తున్న ఓదార్పు మాటలు ప్రజలకు సాంత్వన కలిగిస్తున్నాయి. నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అందుకే పాదయాత్ర సాగేకొద్దీ ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. వైకాపా నాయకులు తరలిస్తున్న ప్రజలు, వైకాపా కార్యకర్తలు ఉన్నప్పటికీ స్వచ్ఛంధంగా తరలివస్తున్న ప్రజలు…..వైఎస్ జగన్ ప్రసంగాలకు ప్రభావితమవుతున్న ప్రజలు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారని సాక్షాత్తూ చంద్రబాబుకే ఆయన ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చి చెప్పాయని టిడిపి నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్తూ ఉన్నారు.

ఇప్పుడు కొరటాల శివ కూడా వైఎస్ జగన్‌ పాదయాత్రను ప్రేరణగా తీసుకునే ‘వచ్చాడయ్యో స్వామీ’ పాటను రూపొందించాడని తెలుస్తోంది. ఈ పాట రూపకల్పనలో భాగస్వాములు అయినవాళ్ళే ఈ విషయం చెప్పారు. వైఎస్ పాదయాత్రకు హాజరవుతున్న ప్రజలు, వైఎస్ జగన్‌ని చూసినప్పుడు, ప్రసంగాలు విన్నప్పుడు ఆయా ప్రజల్లో కనిపిస్తున్న ఆనందం, నమ్మకం అన్నీ కనిపించేలా ఒక మంచి పాట కావాలని కొరటాల శివ లిరిక్ రైటర్‌కి చెప్పాడట. ఇదే విషయంపై స్పందించమని కొరటాల శివను కూడా అడిగినప్పుడు వైఎస్ జగన్‌తో పాటే ప్రజల్లో స్పందన తీసుకొచ్చిన, ప్రజా సమూహానికి భరోసా ఇచ్చిన నాయకుల ప్రేరణతోనే ఈ పాట రూపకల్పన జరిగినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే టీజర్ డైలాగ్‌తో ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిన వాడు మనిషే కాడని చెప్పి అధికారంలో ఉన్న ‘ముఖ్య’ నాయకులను కూడా ధైర్యంగా విమర్శించిన కొరటాల శివ ఇప్పుడు ఏకంగా జగన్ హీరోయిజం ఇంకా ఎలివేట్ అయ్యేలా ఉన్న సాంగ్‌ని జనాల్లోకి వదిలాడు. సినిమాలో కూడా వైఎస్‌ల గొప్పతనం చూపించే సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం భరత్ అను నేను సినిమాతో వైకాపా శ్రేణులు, నాయకులు పూర్తి ఉత్సాహం, ఆనందంతో ఉంటే టిడిపి నాయకులు, శ్రేణులు మాత్రం గరం గరంగా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -