Friday, May 10, 2024
- Advertisement -

‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ

- Advertisement -

ద‌ర్శ‌కుడు మారుతి వ‌ర‌స హిట్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.తాజాగా ఆయ‌న ర‌చ‌యిత‌గా మారి క‌థ అందించిన సినిమా బ్రాండ్ బాబు. నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రభాకర్‌ డైరెక్టర్‌గా, కన్నడ హీరో సుమంత్‌ శైలేంద్రను హీరోగా పరిచయం చేస్తూ.. మారుతి కథతో తెరకెక్కిన సినిమా బ్రాండ్ బాబు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.మ‌రి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

కథ :డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు.తన బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్‌ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. త‌రువా ఏం జ‌రిగింద‌నేది మిగిన‌లిన క‌థ‌.

న‌టీన‌టులు :బ్రాండ్‌ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు.క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్‌ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్‌ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది.

విశ్లేష‌ణ :దర్శకుడిగా ప్రభాకర్ కు బ్రాండ్‌ బాబు బ్రేక్‌ ఇస్తుందనే చెప్పాలి. మారుతి కథను తనదైన టేకింగ్‌తో ఆసక్తికరంగా తెరకెక్కిం‍చాడు. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి.జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్‌ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్‌ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర‍్చు పెట్టారు.

బోట‌మ్ లైన్ :టైమ్ పాస్ మూవీ

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -