Tuesday, April 30, 2024
- Advertisement -

’ధృవ’ మూవీ రివ్యూ 

- Advertisement -

 

Ram Charan’s Dhruva Movie Review

తన ప్లాపుల కహానీ పక్కకి పెట్టి హిట్ బాట పట్టాలి అంటే తనకి రీమేక్ మాత్రమే దిక్కు అని ఫిక్స్ అయిన రామ్ చరణ్ ఒక తమిళ థ్రిల్లర్ సినిమా హక్కులని తన మావా అల్లూ అరవింద్ ద్వారా కొనేసాడు. ఆ సినిమానే తానీ ఒరువన్. తెలుగులో పాష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కి టీజర్ టైం నుంచే పాజిటివ్ టాక్ ఉండనే ఉంది.  

ప్రమోషన్ లు కూడా గట్టిగా చేసి చరణ్ కెరీర్ ల మొదటి సారి ఫుల్ బాడీ తో కనిపిస్తూ ఉండడం తో ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా పట్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్ లే ఉన్నాయి .. 

కథ – పాజిటివ్ లు  :  ధృవ అనే IPS ఆఫీసర్ సమాజం లో జరిగే ప్రతీ తప్పిదానికీ కారణం ఎక్కడో ఒక చోట ఉంటుంది అని అర్ధం చేసుకుంటాడు. రాజకీయ నాయకుల దగ్గర నుంచీ ప్రతీ మనిషి పర్సనల్ లైఫ్ ని ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఆ మెయిన్ కల్ప్రిట్ నే తన టార్గెట్ గా అనుకుని అతన్ని అంతం చెయ్యాలి అని పూనుకుంటాడు. ఆ వ్యక్తి సిద్దార్థ్ అభిమన్యు – అరవింద్ స్వామి . బయట ప్రపంచానికి సూపర్ సైంటిస్ట్ గా గొప్ప డాక్టర్ గా తెలిసిన అరవింద్ స్వామీ వెనకాల మాత్రం సొసైటీ ని శాసించే అత్యంత క్రూరుడు గా ఉంటాడు. ఇతని ఆటలు కట్టించడం కోసం జీవితాన్ని అయినా వదులుకోవాలి అని ఫిక్స్ అయిన రాం చరణ్ కి అది సాధ్యం అయ్యందా లేదా అనేదే కథ. రామ్ చరణ్ పర ఫార్మెన్స్ విషయం లో సూపర్ గా ఎదిగాడు, బాడీ షో నుంచీ డైలాగ్ డెలివరీ విషయం వరకూ చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు చరణ్. చరణ్ తరవాత ఈ సినిమాకి సెకండ్ హీరోగా సాగిపోయాడు సిద్దార్థ్ అభిమన్యూ .. అరవింద్ స్వామి . విలన్ క్యారెక్టర్ కోసం ఎంతోమంది ఉన్నా అరవింద్ స్వామినే ఎందుకు తీసుకుని వచ్చారు అనేది ఈ సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. అందాలతో రకుల్ ప్రీత్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాల్సిన చోట పర్ఫెక్ట్ గా ఇచ్చాడు తమీజా. ఇంటర్వెల్ తరవాత వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హై లైట్ గా నిలుస్తాయి అనడం అతిశయోక్తి కాదు. సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం గా నిలిచింది.  ఇంటర్వెల్ తరవాత పాట తరవాత స్టోరీ లోకి సీరియస్ గా వెళ్ళిపోయిన డైరెక్టర్ ఆఖరి నిమిషం వరకూ ప్లాట్ ని ఎక్కడా మిస్ అవ్వలేదు. మిస్ లీడ్ చెయ్యకుండా ధృవ – సిద్దార్థ్ అభిమన్యూ ల మధ్యన అద్భుతమైన పోరాటం చూపించాడు. ఆఖరి ఇరవై నిమిషాలూ సినిమాకి ఆయువు పట్టు. హీరోయిన్ కి హీరో లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం పర్ఫెక్ట్ గా రాసారు. 

నెగెటివ్ : ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా డుల్ గా సాగుతుంది. మొదటి పది నిమిషాలూ స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉండి తరవాత బాగా స్లో అయ్యింది.   డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలుగులోకి తమిళ సినిమాని అడాప్ట్ చేస్తూ నేటివిటీ బాగా మిస్ అయ్యారు. అక్కడక్కడా కన్ఫ్యూజన్ ని వేరు చేస్తూ మనదైన శైలి లో చెప్పడం మిస్ అయ్యారు.  హీరో హీరోయిన్ ల మధ్యన కెమిస్ట్రీ ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ .. హీరో వద్దు అంటూ ఉన్నా కూడా హీరోయిన్ అలా వెనకాలే ఎందుకు పడుతుందో అర్ధం కాదు. హీరో కోసం అంత పరితపించిపోయే కారణం కూడా ఏమీ ఉండదు. కామెడీ పెద్దగా లేకపోవడం బ్యాడ్ పాయింట్.

మొత్తంగా : మొత్తంగా చూసుకుంటే మాతృక సినిమా తనీ ఒరువన్ తో పోల్చుకుంటే ఈ చిత్రం ఆ రేంజ్ లోనే అనిపిస్తుంది. ఆ చిత్రాన్ని చూడని వారికీ తెలుగు వెర్షన్ సూపర్ గ నచ్చేష్టుంది  ఖచ్చింగా నచ్చే ఛాన్స్ ఉంది. అంచనాలని అందుకునే సబ్జెక్ట్ ఉన్నా సురేందర్ రెడ్డి టేకింగ్ అక్కడక్కడా డల్ అయ్యింది అది ఫస్ట్ హాఫ్ కే పరిమితం  . సెకండ్ హాఫ్ లో ట్రాక్ ఎక్కేసిన డైరెక్టర్ చరణ్ కెరీర్ లో ఒక మరపురాని సినిమా అందించాడు.. మొత్తం మీద ధృవ సినిమా ఈ వారాంతం లో చూడదగ్గ సినిమా అయినా రెవెన్యూ పరంగా ఆఫ్ సీజన్ లో ఇరగదీస్తుంది రామ్ చరణ్ కెరీర్ కి ప్లాపుల పంట నుంచి హిట్టు మార్గం వైపు నడిపించబోతోంది ధృవ. 

{youtube}61CjZqeu2KQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -