Wednesday, May 8, 2024
- Advertisement -

అఖిల్ అలా ..విక్రమ్ ఇలా

- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విక్రమ్ కే కుమార్ అంటే ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కాని ఆయ‌న సినిమాలు చేప్తే వెంట‌నే గుర్తుకు వ‌స్తారు.ఇష్క్ ,మ‌నం ,24,సినిమాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్ర‌మ్‌,ఆయ‌న మీద న‌మ్మ‌కం త‌మ ఫ్యామిలీకి మ‌ర‌చిపోలేని ‘మ‌నం’ హిట్ ఇచ్చిన విక్ర‌మ్‌కు అఖిల్ రెండో సినిమా బాద్య‌త అప్ప‌గించాడు నాగ్‌.దర్శకుడిగా విక్రమ్ కే కుమార్ ప్రతిభ ఏమిటో తెలియనిది కాదు. చేసిన ప్రతి సినిమా కూడా సినీ విమర్శకుల ప్రశంసలు పొందేలా చేయడంలో సిద్ధహస్తుడైన విక్రమ్ కే కుమార్, సినీ వేడుకలపై మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడరు.

విక్ర‌మ్‌కు మొహ‌మాటం ఎక్కువ ,రెండు మాట‌ల‌కు మించి ఎక్క‌వ మాట్లాడ‌రు.“హలో” సినిమా ఆడియో వేడుక ఇందుకు విరుద్ధమేమి కాదు.“హలో” ఆడియో వేడుకపై యధావిధిగా ప్రసంగించలేదు. యాంకర్లు అడిగిన ఒకటి, రెండు ప్రశ్నలకు ముభావంగా చిరు సమాధానాలు చెప్పి, ఓ నవ్వు నవ్వేసారు. ఇంత ‘సూపర్ టాలెంటెడ్’ డైరెక్టర్ ఇంత మౌనం వహిస్తుంటే,అఖిల్ మాత్రం ఏమాత్రం వ‌ణుకు బెణుకు లేకుండా ఆత్మ‌విశ్వాసంతో లైవ్‌పెర్ఫార్మన్స్ ఇచ్చి త‌న ద‌ర్శ‌కుడికి త‌ను పూర్తి విరుద్ద‌మ‌ని చెప్ప‌క‌నే చేప్పేశాడు అఖిల్‌.అఖిల్, తన రెండు నిముషాల ప్రసంగంలోనూ అంతే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. దీంతో అఖిల్ కు, ఆయన దర్శకుడు విక్రమ్ కు ఎంత తేడా ఉందో అంటూ మాట్లాడుకోవడం అభిమానుల వంతయ్యింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -