Friday, May 3, 2024
- Advertisement -

‘ఫలక్ నుమా దాస్’ రివ్యూ

- Advertisement -

ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో తన నటనతో మెప్పించిన నటుడు విశ్వక్ సేన్ ఈసారి ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మలయాళం సినిమా ‘అంగమలి డైరీస్’ అఫీషియల్ తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటించడమే కాక ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. నటుడిగా తన ప్రతిభను చాటిన ఆ విశ్వక్ సేన్ దర్శకుడిగా ప్రేక్షకులకు ఎంత వరకు మెప్పించాడో చూద్దాం..

కథ:
హైదరాబాద్లో ఫలక్నామా ఏరియాలో నివసించే దాస్ (విశ్వక్ సేన్) మాంసం కొట్టే బిజినెస్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం వల్ల తన జీవితం తలకిందులు అవుతుంది. తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అప్పుడు కోపం లో దాస్ ఏం చేస్తాడు? దాని నుంచి తను ఎలా బయటకు వస్తాడు? చివరికి ఏమవుతుంది? అనేది సినిమా కథ.

నటీనటులు:
విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా పరిగణించవచ్చు. ఇప్పటివరకు నటనలో తనకు కొంత అనుభవం ఉండటం వలన ఇలాంటి సినిమాలో కూడా నటించడం సులువైంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విశ్వక్ సేన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాలో తను చాలా సహజంగా మరియు రియలిస్టిక్ గా నటించాడు. ఉత్తేజ్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. తరుణ్ భాస్కర్ కు ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర దక్కింది. దర్శకుడిగానే కాక ఒక నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోయిన్ లు సలోని మిశ్రా మరియు హర్షిత గౌడ్ నటించారు. ఈ సినిమా కి వీరి ఇరువురి పాత్రలే మైనస్ గా చెప్పుకోవచ్చు. హీరోయిన్లు ఇద్దరూ మెప్పించడం లో పూర్తి గా విఫలమయ్యారు. మిగతా నటీనటులు కూడా కొత్తవారు అయినప్పటికీ కొంత మంది బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
రీమేక్ సినిమా అయినప్పటికీ హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం కొంచెం మార్చి మరింత ఆసక్తికరంగా మార్చాడు. ఉన్నది ఉన్నట్లు దింపకుండా ఈ సినిమాను సరికొత్త విధంగా తెరకెక్కించాడు. కానీ ఆ ప్రయత్నం లో నే పూర్తి గా విజయం సాధించలేకపోయాడు. నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగా కూడా ఈ సినిమాలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు ఈ యువ హీరో కానీ రెండు విభాగాల్లో విశ్వక్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ మరియు మీడియా నైన్ క్రియేటివ్ వర్క్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పచ్చు. పాటలు బాగాలేవు కానీ వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమా లో కొన్ని ముఖ్య సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. విద్యాసాగర్ చింత అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. రవితేజ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
మళయాళం సినిమాలో ఉన్న కథను తెలుగు నేటివిటీ కి సెట్ అయ్యేలాగా దర్శకుడు చాలా బాగా మలిచాడు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటినుంచి ఆఖరి వరకు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోయింది. దర్శకుడు ఈ సినిమా కథను చాలా బాగా నెట్ చేయలేకపోవడం తో అసలు సినిమా లో ఏం ఆశ్చర్యం కలుగుతుంది. సినిమా ని నడిపించిన విధానం లో వైవిధం కనపడలేదు. ఒక దాని తర్వాత ఒక సన్నివేశం అయితే వస్తుంది కానీ, అవన్నీ చివరి వరకు ఆడియన్స్ ని మెప్పించడం లో విఫలమయ్యాయి. చివరిగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సినిమా కి కీలకం కాగా వాటిని హాండిల్ చేయడం లో దర్శక నిర్మాతలు విఫలమయ్యారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లు ఏమీ లేవు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలని మెప్పించడం కష్టమైన పనే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -