Sunday, April 28, 2024
- Advertisement -

హీరో వరుణ్ సందేశ్ ఇంట విషాదం!

- Advertisement -

టాలీవుడ్‌ హీరో, బిగ్‌బాస్‌ 3 ఫేం వరణ్‌ సందేశ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వరుణ్ సందేశ్ తాత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీడిగుంట రామచంద్రమూర్తి మృతి పట్ల ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.  తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. 

టీవీ సీరియళ్లకు స్క్రిప్టు రాశారు. ‘అమెరికా అబ్బాయి’ చిత్రానికి కథ అందించిన జీడిగుంట, ‘ఈ ప్రశ్నకు బదులేది’, ‘పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు’ అనే చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ‘అమృత కలశం’, ‘మరో మాయాబజార్’ చిత్రాలకు రచనా విభాగంలో పాలుపంచుకున్నారు. జీడిగుంట రామచంద్రమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. జీడిగుంట అప్పట్లో సారా ఉద్యమ నిషేధంపై రాసిన పరివర్తన అనే నాటకానికి గాను ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

అంతేకాదు, పలు టెలివిజన్ కార్యక్రమాలకు కూడా ఆయన నంది  పురస్కారాలు పొందారు.   1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్‌ సహకార బ్యాంక్‌లో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసిన అనంతరం 1971లో హైదరాబాద్‌ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. 1960లో ఆయన తొలిసారిగా రచించిన ‘హంసగమన’ అనే కథ ప్రచరితమయ్యింది. ఆ తర్వాత ఆయన 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్‌ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు. 

ముక్కు అవినాష్ కి ఆత్మహత్య ఆలోచన.. కారణం అదేనా?

అబ్బో.. నాని చిరకాల కోరిక నెరవేరబోతుందా?

‘కార్తీకదీపం’కు గుడ్ బై చెప్పన డాక్టర్ బాబు..? ఏమైంది…?

టాలీవుడ్‌ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -