Sunday, May 26, 2024
- Advertisement -

జ్యో అచ్చుతానంద రివ్యూ

- Advertisement -

ఊహలు గుస గుస లాడే లాంటి సినిమాతో తెలుగు సినిమాకి అద్భుతమైన రాం కాం ని పరిచయం చేసారు శ్రీనివాస్ అవసరాల. ఒక డీసెంట్ సినిమాని , లవ్ స్టోరీ నీ బిల్డప్ చేస్తూ ఫామిలీ ప్రేక్షకులు కూడా హ్యాపీగా చూసి నవ్వుకోగలిగే చిత్రం తీయడం లో కొత్త పంథా పాటించింది ఆ సినిమా. ఇప్పుడు జ్యో అచ్చుతానంద తో సోర్య – నారా రోహిత్ – రేజీనా లతో వస్తున్న అవసరాల శ్రీనివాస్ ఏ మేరకు మెప్పించారో చూద్దాం రండి.

కథ  – పాజిటివ్ లు:

అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) ఇద్దరు మంచి అన్నదమ్ములు. చిన్న చిన్న ఆనందాలతో బతికే ఓ మధ్య తరగతి కుటుంబ యువకులైన ఈ ఇద్దరూ, సరదాగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో వారింటికి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. కొద్దికాలంలోనే ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోతారు. అచ్యుత్, ఆనంద్.. ఇద్దరూ జ్యోత్స్నని ప్రేమిస్తూ ఉంటారు. అయితే జ్యోత్స్న మాత్రం తాను అప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని చెప్పి ఇద్దరి ప్రేమనూ తిరస్కరిస్తుంది. అదే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అచ్యుత్, ఆనంద్‌ల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే ఇంట్లో కలిసి ఉన్నా, ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉండరు. పెళ్ళిళ్ళై కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వీరిద్దరి జీవితాల్లోకి జ్యోత్స్న మళ్ళీ వస్తుంది. దాంతో వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది సినిమా. ఈ సినిమాకి అవసరాల రాసిన కామెడీ సీన్ లు, వన్ లైనర్ లూ హై లైట్ అని చెప్పాలి. దాంతో పాటు సినిమా నిడివి తక్కువగా ఉండడం కూడా పాజిటివ్ పాయింటే .. ఆసాంతం ఆసక్తి ని రేపుతూ నవ్విస్తూ సాగుతుంది ఈ చిత్రం. మొదట ముప్పై నిమిషాల పాటు కథని రెండు వేరు వేర్ కోణాల్లో చెప్పడం లాంటివి అవసరాల లోని స్క్రీన్ ప్లే రైటర్ ని బయటకి తీసుకుని వచ్చాయి. సినిమా రెండో భాగం లో సూపర్ గా సాగిన నారేషన్ సినిమాకి బలం చేకూర్చింది. సినిమా ఆద్యాంతం డైలాగులతో, సన్నివేశాల్లో వచ్చే కన్ఫ్యూజన్‌తో పుట్టించిన కామెడీ కట్టిపడేసేలా ఉంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మొదటి హాఫ్ సినిమాకి పెద్ద అసెట్ అనే చెప్పాలి. సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్, సెకండాఫ్ వేటికవే ఒక ప్రత్యేకమైన ఎమోషన్‌తో నడిచాయి. ఇందులో ఇంటర్వెల్ బ్లాక్, మొదటి ముఫ్పై నిమిషాల పాటు సాగే సరికొత్త నెరేషన్, క్లైమాక్స్ లాంటివి హైలైట్స్‌గా చెప్పొచ్చు.

నెగెటివ్ లు :

ఈ సినిమాకి సెకండ్ హాఫ్ లో ఆఖరి ముప్పై నిమిషాలూ బాగా నెగెటివ్ గా నడుస్తుంది . ముఖ్యంగా రేజీనా రివెంజ్ అంటూ తీర్చుకున్నే సన్నివేశాలు చాలా చిరాకుగా అనిపిస్తాయి. మొదటి భాగం తో పోలిస్తే రెండో హాఫ్ చాలా డల్ గా నడుస్తుంది. స్టోరీ కూడా మరీ ప్రిడిక్తబుల్ గా సాగుతుంది. నారా రోహిత్ ఆహార్యం , స్టైల్ అస్సలు నప్పలేదు. నాగ శౌర్య తో పోల్చుకుంటే రోహిత్ తేలిపోయాడు. ఎమోషనల్ బొండేజ్ లో హీరోలు ఇద్దరి మధ్యనా బ్రదర్ కెమిస్ట్రీ వర్క్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో వారిద్దరి మధ్యనా ఒచ్చే సన్నివేశాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాదిరిగా అనిపిస్తాయి ..

మొత్తంగా :

మొత్తంగా చూసుకుంటే జ్యో అచ్చుతానంద ఒక వింతైన ఎక్స్ పరిమెంటల్ సినిమా .. కమర్షియల్ విలువలూ – హాస్యం జోడిస్తూ సాగిన ఈ ప్రయోగానికి మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవితంలో జరిగే కథలే సినిమాలైతే అలాంటి సినిమాలు చూడడానికి ఎప్పుడూ బాగుంటాయి. అలాంటి సినిమాలకు మంచి రచన, అందులో సరిగ్గా ఒదిగిపోయే పాత్రలు, సందర్భానుసారంగా నవ్వించే సన్నివేశాలు కూడా తోడైతే అవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అవసరాల శ్రీనివాస్ తన రచనతో చేసిన అలాంటి మ్యాజిక్కే ‘జ్యో అచ్యుతానంద’. కథగా చూస్తే చాలా సింపుల్‌గా కనిపించే దాన్నే చివరివరకూ ఆసక్తికరంగా, ఓ బలమైన సినిమాగా మలచడంలో సఫలమవ్వడం, తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటులు, సరదాగా సాగుతూనే ఎక్కడో ఓచోట ఆలోచింపజేసేలా సాగే సన్నివేశాలు.. ఇలా చాలా ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్ కాస్త స్లో అవ్వడం అన్నది ఒక్కటే మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘జ్యో’ రాకతో బలంగా బలపడి ‘అచ్యుత్’, ‘ఆనంద్‌’ల అందమైన కథే ‘జ్యో అచ్యుతానంద’!

రేటింగ్ : 3.5/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -