Sunday, May 26, 2024
- Advertisement -

ఖాకీ మూవీ రివ్యూ

- Advertisement -

సినిమా: ఖాకీ
న‌టీన‌టుడు: కార్తీ, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌
ద‌ర్శ‌కుడు: వినోద్‌
సంగీతం: జిబ్రాన్‌

ఊపిరితో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత ద‌గ్గ‌రైన న‌టుడు కార్తీ. త‌న అన్న సూర్య క‌న్నా ఇప్పుడు కార్తీకే క్రేజ్ ఎక్కువ‌గా ఉంది. అత‌డు న‌టించిన సినిమాలు తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం తాను న‌టించిన ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ అనే చిత్రాన్నితెలుగులో ‘ఖాకీ’ పేరుతో విడుద‌ల చేశారు. ఈ శుక్ర‌వారం (నవంబర్ 17న) థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: ధీరజ్ (కార్తీ) శిక్ష‌ణ తరువాత తమిళనాడులోని ఓ ప్రాంతంలో డీఎస్పీగా బాధ్య‌త‌లు తీసుకుంటాడు. అప్పటికే ప్రియ (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేర‌స్తుల భ‌ర‌తం ప‌డుతూ నీతి, నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఎన్నో కేసుల‌ను చేధించిన ఆయ‌నకు ఓ దోపిడీ కేసు త‌న‌కు స‌వాల్‌గా నిలుస్తుంది. భార్యను ప్రేమగా చూసుకుంటూ వెళ్తున్న ధీరజ్ జీవితాన్ని ఆ కేసు మలుపు తిప్పుతుంది. ఓ ముఠా డబ్బు కోసం ఇళ్లలోకి చొరబడి దోచుకొని ఇంట్లో వారిని అతి క్రూరంగా అందరినీ చంపేస్తుంటుంది. ఈ కేసుని ధీర‌జ్‌కు పోలీస్ ఉన్న‌తాధికారులు అప్ప‌గిస్తారు.ఆ దోపిడీ ముఠా ధీర‌జ్ ఎలా ఆట క‌ట్టించాడు. ఆ ముఠాను పట్టుకునేందుకు ధీరజ్ అతడి బృందం ఏం చేసింది? తన కుటుంబ జీవితంలో ఏం కోల్పోయాడు? తదితర విషయాలతో సినిమా ఆస‌క్తిగా సాగుతుంది. క్రిమినల్స్‌ను పట్టుకోగలిగాడా..? ఈ కేసు కారణంగా ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: ఒక కేసును చేధించే క్ర‌మాన్ని చాలా స‌హ‌జంగా తెర‌కెక్కించారు. నిజాయితీ గల పోలీస్ అధికారి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడ‌ని చూపించారు. పోలీస్ చిత్రాల‌తో పోలిస్తే ఈ సినిమా పూర్తిగా భిన్న‌మైంది. 1985 నుంచి 2005 మధ్య 45కు పైగా దోపిడీలకు పాల్పడి, 18 హత్యలు చేసి, 64మంది జీవితాలను ఇబ్బందులకు గురిచేసిన ఓ నిజమైన ముఠా గురించి రాసుకున్న కథ ఇది. ఈ సినిమాకు క‌థ‌నే ప్ర‌ధాన బ‌లం. ద‌ర్శ‌కుడి శ్ర‌మ‌ను ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. ఆ ముఠా గురించి తెర‌కెక్కించిన విధానం ఆసక్తి క‌లిగిస్తుంది. అక్కడక్కడా సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. బన్నే సింగ్‌, ముఠాలో చదువుకున్న నాయకుడిని అరెస్టు చేసే విధానం స‌స్పెన్స్ కలిగిస్తుంది. ముఠా నాయకుడు ఓమా (అభిమన్యుసింగ్‌)ను పట్టుకోవడంతో ఈ సినిమా పూర్త‌వుతుంది. యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం. విరామ స‌మ‌యం ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్‌ప్లే‌తో సాగింది. కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలిగినా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తోంది.

కార్తీ పోలీస్ అధికారిగా ఒదిగిపోయాడు. బాగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా కార్తి పరిణితి కనబరిచాడు. ప్రియ‌గా గృహిణి పాత్ర‌లో రకుల్ ప్రీత్ సింగ్ త‌న ప‌రిధి మేర‌కు బాగానే న‌టించింది. ఉన్నంతలో త‌న నటనతో మెప్పించింది. అభిమన్యు సింగ్ ప్ర‌తినాయ‌క పాత్రకు న్యాయం చేశాడు. సినిమా మొత్తం హీరో, ముఠా మ‌ధ్య‌నే ఆస‌క్తిక‌రంగా తిరుగుతుంది. స్క్రీన్‌ప్లే వేగంతో ప్రేక్ష‌కుల‌ను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా మంచిగా వ‌చ్చింది. గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం బాగుంది. పాటలు ప‌ర్వాలేద‌నిపించాయి. వేగ‌వంత‌మైన క‌థ‌న నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. 1990 కాలంలో సాగే కథ కావ‌డంతో ఆ విధంగా సన్నివేశాలు తీర్చిదిద్దారు. స‌హ‌జ‌సిద్ధంగా సినిమా వ‌చ్చింది.

మొత్తానికి ఈ సినిమా వేగ‌వంత‌మైన స్క్రీన్‌ప్లే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంటోంది. సెకాండాఫ్ బోర్ అనిపించినా సినిమా ఆడేట‌ట్టు క‌నిపిస్తోంది. యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఇష్ట‌పడే వారికి సినిమా న‌చ్చుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -