రవితేజ ‘ఖిలాడి’ టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాది గ్రేట్’ చిత్రం తర్వాత రవితేజకు వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. కరోనా తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఈ హ్యాట్రిక్ చిత్రం కేవలం 50 శాతం సీటింగ్ తోనే భారీ వసూళ్లను రాబట్టి రవితేజకు సూపర్ కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

- Advertisement -

ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి మరియు సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

వకీల్ సాబ్ రివ్యూ

తెలంగాణలో కరోనా రక్కసి.. కొత్తగా 2,478 పాజిటీవ్ కేసులు!

థియేటర్లో ‘వకీల్ సాబ్’.. ఫ్యాన్స్ పూనకాలు..

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -