అంజ‌లి, ల‌క్ష్మీరాయ్ హీరోయిన్ల మ‌ల్టీస్టార‌ర్‌

- Advertisement -

హీరోల మ‌ల్టీస్టార‌ర్ల సినిమాలు ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఆ సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌తాయి. ఇప్పుడు భారీ మ‌ల్టీస్టార‌ర్ల సినిమాలకు అంద‌రూ సై అంటున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తేజ తీస్తున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమాపై ఇండ‌స్ట్రీ దృష్టంతా ఉంది. ఇప్పుడు ఈ కోవ‌లో హీరోయిన్ల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా రాబోతోంది. హీరోయిన్ల ప్ర‌ధాన పాత్ర‌ల‌తో ఈ సినిమా ఉండ‌నుంది.

గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి సినిమాలు నిర్మించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ నిర్మాత‌గా య‌దార్ఘ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తార‌ని టాక్‌. కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తాడంట‌. కొత్త కథాంశంతో సినిమాను తెరకెక్కించ‌నున్నారు. ఈ సినిమాలో వినోదం తో పాటు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఉండబోతోంది.

- Advertisement -

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను ఒకేసారి తీస్తారంట‌. ప్ర‌స్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సాయికుమార్, న‌రేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తారంట‌. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించ‌నున్నారు. పి.జి విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -