దుమారం రేపుతున్న మహేశ్ బాబు వ్యాఖ్యలు

- Advertisement -

బాలీవుడ్ తనను భరించలేదంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. అడివి శేషు హీరోగా నటించిన మేజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేశ్.. చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. తనను బాలీవుడ్ భరించలేదని మహేశ్ వ్యాఖ్యానించడంతో వివాదం చెలరేగింది. బాలీవుడ్ లోకి ప్రవేశించి … తన సమయం వృథా చేసుకోలేనని.. తనను ఆ పరిశ్రమ భరించలేదన్నారు.

మహేశ్ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ఆయన టీం రియాక్ట్ అయ్యింది. అన్ని భాషలు, సినిమాలపై మహేశ్ బాబుకు గౌరవం ఉందని చెప్పుకొచ్చింది. ఏళ్ల తరబడి తెలుగు సినిమాలు చేయడం వల్లే టాలీవుడ్ లోనే సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో మహేశ్ అలా మాట్లాడారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

తాజాగా మహేశ్ బాబు వ్యాఖ్యలపై బాలీవుడ్ నిర్మాత ముకేశ్ బట్ స్పందించారు. బాలీవుడ్ మహేశ్ ధర భరించలేదని భావిస్తే.. అది చాలా మంచిందన్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు. మహేశ్ వ‌చ్చిన చోటే ప్ర‌యాణం సాగించాల‌నుకోవ‌డాన్ని గౌర‌విస్తాన‌న్నారు. ఎంతో ప్ర‌తిభావంతుడ‌ని, ప్రేక్ష‌కుల్లో మహేశ్ బాబుకు మంచి గుర్తింపు ఉంద‌న్నారు. స‌క్సెస్‌ఫుల్ హీరో, ఆయ‌న అంచ‌నాల‌ను బాలీవుడ్ అందుకోలేక‌పోతే మ‌హేశ్ త‌ప్పేమీ లేద‌న్నారు.

అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఫిదా బ్యూటీ

ఆ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్న చిట్టి

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -