Friday, May 3, 2024
- Advertisement -

‘మ‌జిలీ’ మూవీ రివ్యూ

- Advertisement -

అక్కినేని నాగ‌చైతన్య‌, స‌మంత తాజాగా న‌టించిన చిత్రం మ‌జిలీ. పెళ్లి త‌రువాత వీరిద్ద‌రు భార్య భ‌ర్త‌లుగా న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. పైగా మ‌జిలీ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చింది. భార్య, భ‌ర్త‌లు మ‌ధ్య అనుబంధం గురించి తెలిపేలా సినిమాను తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌,సాంగ్స్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే సినిమా యూఎస్‌. దుబాయ్ వంటి దేశాల్లో విడుద‌ల అయింది. మ‌రి సినిమా ఎలా ఉందో స‌మీక్ష ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ :
పూర్ణ(నాగచైతన్య) క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన కుర్రాడిగా ఉన్నపుడు అన్షు(దివ్యాన్ష కౌశిక్)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు.కానీ అనుకోని కార‌ణాల‌ వల్ల వీరిద్ద‌రు విడిపోతారు. దానితో చైతు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన శ్రావణి(సమంత)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఇష్టం లేని పెళ్లాంతో కాపురం చేయ‌డు పూర్ణ. ప‌ని పాట లేకుండా తాగుడుకి బానిస అవుతాడు. డిప్రెషన్‌లో ఉన్న పూర్ణతో శ్రావణి తన జీవితాన్ని ఎలా గడిపింది.ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఎమోషనల్ గా ఎలా సాగింది? పూర్ణ చివరకి మాములు మనిషిగా మారాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమా మొత్తం ఎమోష‌న‌ల్‌గా సాగుతోంది.“నిన్నుకోరి” లాంటి మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన శివ నిర్యాణ రెండో సినిమా కావ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దానికి త‌గిన‌ట్లుగానే మ‌జిలీ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా మొద‌టి భాగం ఫ‌ర్వాలేద‌ని అనిపించినప్ప‌టికి, చూసే ప్రేక్షకుడిని త‌న కధ‌లో లీనం చేశాడు. ఫస్ట్ హాఫ్ చూసే స‌రికి ప్రేక్షకుడికి ఆసక్తికరంగా నరేషన్ సాగుతున్న అనుభూతి క‌లుగుతోంది. చైతు మరియు అన్షు ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి. ఫ‌స్ట్ఆఫ్ చివ‌ర్లో స‌మంత క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అవుతోంది.సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో పాటు అక్కడ నుంచి సమంత పాత్ర కీలకంగా మారుతుందన్న భావన హైలైట్‌గా నిలుస్తుంది.

“నిన్నుకోరి” లాంటి మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన శివ నిర్యాణ నుంచి వస్తున్న రెండో సినిమా కావడం వలన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.సినిమా మొదలు అయ్యినప్పటి నుంచి పర్వాలేదనిపించే స్థాయి నుంచి మెల్ల మెల్లగా ఆసక్తికరంగా నరేషన్ సాగుతున్న అనుభూతి అయితే ఫస్ట్ హాఫ్ చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఇక్కడ శివ బాగా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి.అలాగే ఫస్టాఫ్ లో చైతు మరియు అన్షు ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి.అలాగే సినిమా సగానికి పూర్తయ్యే సరికి సరిగ్గా సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో పాటు అక్కడ నుంచి సమంత పాత్ర కీలకంగా మారుతుందన్న భావన హైలైట్ గా నిలుస్తుంది.

న‌టీ,న‌టీలు ఫ‌ర్మామెన్స్‌:
ఇక న‌టీ, న‌టులు విష‌యానికి వ‌స్తే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు త‌మ న‌ట‌న‌తో ఆ పాత్ర‌ల‌కు ప్రాణం చేశారని చెప్పాలి. నాగ‌చైత‌న్య టీనేజ్ వయసులో క్రికెటర్‌గా అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్‌గా నటనలో వైవిధ్యాన్ని చూపించాడు. స‌మంత విష‌యానికి వ‌స్తే సినిమాకు మెయిన్ క్యారెక్ట‌ర్ అని చెప్పాలి. స‌మంత ఎంట్రీ ద‌గ్గ‌ర నుంచి సినిమా మ‌రో లేవ‌ల్‌కు వెళ్తోంది.చై మరియు సమంతల మధ్య వచ్చే వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో వీరి నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. సమంత‌ బాధ్యత గల యువతిగా ,భార్యగా అద్భుత నటనను కనబర్చారు. మిగతా పాత్రల్లో సుబ్బరాజ్, పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:
ద‌ర్శకుడు శివ తాను రాసుకున్న క‌థ‌ను వెండితెర మీద చూపించ‌డంలో విజ‌యం సాధించాడు. సినిమా మొద‌టి భాగం సాదా సీదాగా సాగుతున్న త‌రుణంలో క‌థ‌ను ఆసక్తికరంగా మ‌లిచి ప్రేక్ష‌కుడికి బోర్ కొట్ట‌కుండా చేశాడు. సంగీతం విషయానికి వస్తే గోపి సుందర్ అద్భుత‌మైన పాట‌ల‌ను అదించాడు. థమన్ అందించిన నేప‌థ్య సంగీతం అంద‌రికి ఆక‌ట్టుకుంటుంది. విష్ణు శర్మ ఫోటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువులు కూడా సినిమాకు త‌గిన‌ట్లుగానే ఉన్నాయి.

బోట‌మ్ లైన్‌:
మొత్త‌నికి భ‌ర్త‌కు మ‌రో హిట్ అందించిన స‌మంత‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -