అఫీషియల్ : లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్..! విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మించారు. కాగా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. ఏప్రిల్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత లవ్ స్టోరీ నిర్మాతలు తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీ లో విడుదల చేసేది లేదని.. థియేటర్లో ఓపెన్ అయి రోజుకు నాలుగు షోలు వేస్తున్నప్పుడే విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు.

- Advertisement -

వారు చెప్పినట్లే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా అఫీషియల్ గా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి సినిమా వస్తుండడం, ఈ సినిమాలోని సారంగధరియా పాట ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనం సృష్టించడంతో లవ్ స్టోరీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ గా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వారు ఎదురుచూస్తున్నారు.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. ఒకే రోజు నాలుగు సినిమాల అప్డేట్స్.. ఎప్పుడంటే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -