Friday, May 10, 2024
- Advertisement -

నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ

- Advertisement -

రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఘాజీ సినిమాలో నటించి.. అదరహో అనిపించారు. అయితే ఇప్పుడు హిట్స్ లేని దర్శకుడు తేజ ని నమ్మి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న భయం అందరిలో ఉంది. ఎందుకంటే.. దర్శకుడు తేజకు గత కొన్నాళ్లుగా హిట్ లేదు కాబట్టి. కానీ ఈ సినిమా ట్రైలర్ వచ్చాయ అర్ధం అయింది. తేజ ఏదో మాయ చేయబోతున్నాడని. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని రానా తండ్రి సురేష్ బాబు నిర్మించారు. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ పల్లెటూరిలో జోగేంద్ర వడ్డీ వ్యాపారం చేస్తూ.. రైతులకు డబ్బు సహాయం చేస్తుంటాడు. ఓ రోజు ఆ ఊరి సర్పంచ్ చేతిలో అవమానికి గురవ్వడంతో.. ఎలాగైన పాలిటిక్స్ లోకి తావాలని నిర్ణయం తీసుకొని.. ఎన్నికల్లో పోటీచేస్తాడు. అప్పటి వరకు జోగేంద్రగా ఉన్న పేరును రాధాను వివాహం చేసుకుని రాధా జోగేంద్రగా మారుతాడు. ఎన్నికల్లో నిలబడి.. తనికెళ్ళ భరణి కేబినెట్ లో మంత్రిగా తన ప్రస్థానాన్నిదిగ్విజయంగా మొదలుపెడతాడు. కానీ అతని టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ. ఈ నెపథ్యంలో చాలా సంఘటనలు.. దాడులు, హత్యలు జరుగుతాయి. మరి చివరికి అతను అన్నుకున్నది ఎలా సాధించాడు.. అసలు ఏం జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది.. :

దర్శకుడు తేజ రాసుకున్న కథ బాగుంది. ఓ మాములు వ్యక్తి ఎన్నికల్లో నిలబడి.. ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. ఎంత ఎత్తుకు ఎదిగాడు.. చివరికి ఏమైయాడు అనే ఆసక్తికర అంశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించాడు డైరెక్టర్ తేజ. ఇక రాధకు, జోగేంద్రకు మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో బలమైన సీన్స్..జోగేంద్ర క్యారెక్టర్ కు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. ప్రీ ఇంటర్వెల్ బాగుంది.. సెకండాఫ్ పై అంచనాలను పెంచింది. తేజ రాసుకున్న కామెడీ సీన్స్ కూడా బాగా పండాయి. ఇక లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. క్లైమాక్స్ లో కూడా తేజ మార్క్ కనిపిస్తోంది. రానా ఈ మూవీని తన భుజాలపై వేసుకొని నడిపించారు. కాజల్ పాత్ర కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. ఓ పొలిటికల్ లీడర్ భార్య..మానసికస్థితి బట్టి చాలా మెచూర్డ్ యాక్టింగ్ ను చేసింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతికగా :

మొదట గా డైరెక్టర్ తేజ గురించి మాట్లాడుకోవాలి. తేజ సినిమా హీట్స్ తీయగాలడా అనే వారికి నేనే రాజు నేనే మంత్రి సరైన సమాధానం. కథను ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఇంట్రస్టింగ్ గా నడిపించాడు. సెకండ్ హాఫ్ లో కాస్త స్క్రీన్ ప్లే ను బాగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా సినిమా విజయంలో మంచి పాత్రను పోషించింది. లక్ష్మి భూపాల అందించిన డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. సినిమాటోగ్రఫీ కూడా చాల బాగుంది. ఎడిటర్ కాస్త సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :
రానా
కాజల్
తేజ దర్శకత్వం
ఫస్ట్ హాఫ్
అనూప్ రూబెన్స్ సంగీతం
లక్ష్మి భూపాల డైలాగ్స్

మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

మొత్తంగా : డైరెక్టర్ తేజ మార్క్ సినిమాలను.. పొలిటికల్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -