Thursday, April 25, 2024
- Advertisement -

ఛల్ మోహన రంగా రివ్యూ…. ఎలా ఉందంటే?

- Advertisement -

చల్ మోహన రంగా….. త్రివిక్రమ్ స్టోరీ బాగుందా? సినిమా ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు నిర్మాణంలో భాగస్వాములైన సినిమా…….త్రివిక్రమ్‌తో కలిసి ‘అ…ఆ’లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన నితిన్ హీరోగా వస్తున్న సినిమా. ఇలా ఛల్ మోహన రంగా సినిమాకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే కూడా అజ్ఙాతవాసి సినిమాతో తన పెన్ పవర్‌పై ఎన్నో అనుమానాలు రేకెత్తించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ ఎలా ఉంది అన్నదే ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది. చాలా ఎక్కువ మంది ప్రేక్షకులు ఛల్ మోహన రంగా వైపు అనుమనంగా చూడడానికి కారణమైంది. మరి వాళ్ళ అనుమానాలు నిజమయ్యాయా? సినిమా ఎలా ఉంది?

ఈ సినిమాలో కథలేదని ట్రైలర్‌లోనే చెప్పేశారు మేకర్స్. కథ ఏదైనా ఉండి ఉంటే ట్రైలర్‌లో కనీసం హింట్స్ అయినా ఇచ్చి ఉండేవాళ్ళుగా. అలాంటిది ఏమీ చేయలేదు. కేవలం కామెడీ సీన్స్, లవ్ సీన్స్‌తో ట్రైలర్‌లో కట్ చేశారు. సినిమాలో కూడా అవే హైలైట్ అయ్యాయి.

చిన్నప్పుడే ఒక అమ్మాయి-అబ్బాయి కలవడం…….పెద్దయ్యాక ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా లవ్‌లో పడడం….విడిపోవడం……ఫ్లాష్ బ్యాక్ తెలిశాక ఆనందంగా కలిసిపోవడం……ఇదే కథ. పరమ రొటీన్ పాత కథ. ఈ సినిమా కథ పరంగా త్రివిక్రమ్ సామర్థ్యంపై మరోసారి అనుమానాలు రేకెత్తిన పరిస్థితి.
అయితే ఈ సినిమా డైరెక్టర్ కృష్ణచైతన్యకు ఘోష్ట్ రైటర్‌ అనే స్థాయిలో వర్క్ చేశాడో…….లేక గైడెన్స్ ఇచ్చాడో తెలియదు కానీ కామెడీ ట్రాక్స్ మాత్రం బాగా సక్సెస్ అయ్యేలా చేశాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లు నవ్విస్తాయి. నితిన్-మేఘా ఆకాష్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇతర ఆర్టిస్టులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్‌గా కూడా ఉన్నతంగా ఉంది ఈ ఛల్ మోహనరంగా.

పరమ రొటీన్ పాత కథ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకు ఈ ఛల్ మోహన రంగడు కొంత వరకూ నచ్చే ఛాన్స్ ఉంది. కాస్త ఆసక్తికరమైన కథ ఉండాలనుకున్నా డిసప్పాయింట్ అవుతారు. నాలుగు కామెడీ సీన్స్….రెండు లవ్ సీన్స్…..అన్నట్టుగా సాగిపోయే ఛల్ మోహన రంగా కామెడీ లవర్స్ మాత్రం ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. సినిమాలో ఏమీ లేకపోయినా పర్లేదు నాలుగు కామెడీ సీన్స్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -