Tuesday, May 7, 2024
- Advertisement -

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ ముఖ్య అతిధిగా ‘అ ఆ ’

- Advertisement -

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ ముఖ్య అతిధిగా ‘మే 2’ న ‘అ ఆ’ ఆడియో వేడుక జరగనుందని చిత్ర నిర్మాత  ‘సూర్యదేవర రాధాకృష్ణ  తెలిపారు. కధానాయకుడు నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు  ఆడియో వేడుకకు రావటం పట్ల  ఆనందాన్ని తన twitter అకౌంట్ లో  తెలిపారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ పతాకంపై నిర్మాత ‘సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)  ‘అ ఆ’    (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక) చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 

ఈ సందర్భంగా  నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ .. మే 2 న హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఆడియో వేడుక చిత్ర ప్రముఖులు, అభిమాన ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ   వైభవంగా జరగనుందని తెలిపారు. చిత్రానికి మిక్కీజె. మేయర్ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుందని అన్నారు. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణచైతన్యలు పాటలకు సాహిత్యం అందించగా, చిత్ర, కార్తిక్, శ్రావణ భార్గవి, అంజనసౌమ్య, రమ్య, సాయి శివాని ,రాహుల్ నంబియార్, అభయ్ జోద్ పుర్ కర్ లు గీతాలను ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ‘అ ఆ’ ఆడియో  విడుదల కానుంది . ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెల లోనే  చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు.  చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.  

ఈ చిత్రానికి సంగీతం- మిక్కిజె. మేయర్,, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్. ప్రకాష్,, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్. సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -