Saturday, April 20, 2024
- Advertisement -

నేను అవార్డులు తీసుకున్నప్పుడు లోకల్.. నాన్ లోకల్ అని అనలేదే?ప్రకాష్ రాజ్ ప్రశ్న

- Advertisement -

వందలాది తెలుగు సినిమాల్లో నటించాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. జాతీయ అవార్డు కూడా అందుకున్నాను. కానీ అప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అని అనలేదని, కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన 27 మంది తో తన ప్యానల్ ని ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు అని ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయమై ఇవాళ ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తన వెనక తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని, మరికొందరేమో ఏపీ సీఎం జగన్ కూడా కలగ చేసుకున్నారని అంటున్నారని, రేపొద్దున అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేరు కూడా వస్తుందేమోనని ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, ఏడాదిగా గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలిపారు. మా ప్యానల్ కోపంతో పుట్టినది కాదని, ఆవేదనతో పుట్టిందని, ఇందులోని సభ్యులంతా సర్వ స్వతంత్రులు అని చెప్పారు.

మా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి నేను లోకల్ కాదు అని అంటున్నారని అన్నారు. తెలుగు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్నప్పుడు, తెలంగాణలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నువ్వు నాన్ లోకల్ అనలేదని ఇప్పుడు మాత్రం ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. కళాకారులకు లోకల్,నాన్ లోకల్ అంటూ ఏమీ ఉండదని, అందరూ యూనివర్సల్ అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.

Also Read

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

ఆచార్య చిత్రంలో శ్రీశ్రీ కవితలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -