‘సలార్​’ కథలో భారీ మార్పులు..!

కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​నీల్​ .. ప్రభాస్​తో భారీ బడ్జెట్​తో సలార్​ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సలార్​ లో శృతి హాసన్​ హీరోయిన్​గా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ షెడ్యూల్​ పూర్తయ్యింది. అయితే ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఆ మూవీ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సలార్ షూటింగ్ మళ్లీ మొదలు కావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ సినిమా కథలో ప్రశాంత్ నీల్ భారీగా మార్పులు చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రం పాకిస్థాన్​, ఇండియా వార్​ నేపథ్యంలో ఈ తెరకెక్కుతునట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ప్రభాస్​ డ్యుయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సలార్​ ఫ్లాష్​బ్యాక్​ ఎపిసోడ్​లో భారీ మార్పులు చేస్తున్నాటరట. ప్లాష్​బ్యాక్​ ఎపిసోడ్​ను భారీగా తగ్గించబోతున్నాడట. సలార్​ నిడివి పెరగడంతో చాలా మేర తగ్గిస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్​లో పలు మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్​.. రాధే శ్యామ్, ఆదిపురుష్​ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓం రౌత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీలో ప్రభాస్​ రాముడిగా నటిస్తున్నాడు. రావణాసురుడిగా సైఫ్​ అలీఖాన్​ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు నాగ్​అశ్విన్​ డైరెక్షన్​లోనూ ఓ మూవీల చేస్తున్నాడు ప్రభాస్​.. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్​ పై తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్​ తార దీపికా పదుకొనే హీరోయిన్​గా నటిస్తోంది. అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్​ సిటీలో ఈ చిత్రం షూటింగ్​ జరుగుతోంది. అమితాబ్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

Also Read

మహేశ్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. బర్త్​డేకు త్రిబుల్ ట్రీట్..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! 

Related Articles

Most Populer

Recent Posts