చిరంజీవి చేతుల మీదుగా ‘రిపబ్లిక్’ ట్రైలర్!

- Advertisement -

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 4వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే కరోనా కారణం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోయాయి.

పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. రాజకీయనాయకురాలిగా రమ్యకృష్ణ .. కలెక్టర్ గా సాయితేజ్ సవాళ్లు విసురుకోవడంపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ”అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్” అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అనే విషయం, ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టమవుతోంది.

దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా లో ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటింస్తుంది. జగపతిబాబు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

Also Read:

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హీరో త‌రుణ్‌..!

వేద‌వ్యాస్‌గా బ్ర‌హ్మానందం

ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యాక్టర్స్ వీరే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -