Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్ విషాదం : ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

- Advertisement -

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడినా.. దాన్ని జయించారు. రెండు రోజుల క్రితమే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రత్న కుమార్‌కు గుండె నొప్పి రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది.

ఘంటసాల రత్న కుమార్ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా పాపులర్ అయ్యారు. 32 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నెన్నో రికార్డులు కొల్లగొట్టారు. రత్న కుమార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఎక్కువ డబ్బింగ్ చెప్పారు రత్న కుమార్.

మొదట్లో సింగర్‌గా చాలా ప్రయత్నాలు చేశారట. కానీ సరైన బ్రేక్ రాలేదని చెప్పుకొచ్చేవారు. దాంతో ఆయన డబ్బింగ్ వైపు దృష్టి పెట్టారు. కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాలకు మాటలను అందించారు. వాటిలో ముఖ్యమైనవి ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ సినిమాలున్నాయి. ఆయన కుమార్తె వీణ తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.

ఆశ్చర్యం.. చికెన్​ లెగ్​పీస్​ రూ. 73 లక్షలు..!

చీర కట్టుతో గుర్రపు స్వారీ.. వీడియో వైరల్

ఓరి నాయనో.. ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -