సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్​.. సెప్టెంబర్​లోనే..!

- Advertisement -

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం హిట్​ అయిన విషయం తెలిసిందే. విభిన్న కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున రొమాంటిక్​ లుక్స్​ అమ్మాయిలను కట్టిపడేశాయి. ఈ చిత్రంలో నాగ్​ డబుల్​ రోల్​లో కనిపించాడు. అయితే త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్​ తీయబోతున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. బంగార్రాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సీక్వెల్​లో నాగార్జునతోపాటు చైతూ కూడా నటించబోతున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్​స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతూ .. లాల్​సింగ్​ చద్దా అనే బాలీవుడ్​ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో చైతన్య ఆర్మీ అధికారి గా కనిపిస్తాడు.

Also Read: డైరెక్టర్ గా స్టార్ కమెడియన్..!

లాల్ సింగ్ చద్దా భారీ బడ్జెట్​తో తెరకెక్కబోతోంది. మరోవైపు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే మరోసినిమాలో చైతూ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్​ ఫైనల్​కు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు పూర్తయిన అనంతరం అంటే సెప్టెంబర్​లో సోగ్గాడే చిన్ని నాయన షూటింగ్​ స్టార్ట్​ అయ్యే చాన్స్​ ఉంది.

Also Read: రామ్ తో ఢీ అంటే ఢీ అంటున్న ఆది పినిశెట్టి..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -