నువు నిజంగా దేవుడివే అయ్యా!

- Advertisement -

ఇప్పటి సమాజంలో సొంత వారిని సైతం పట్టించుకోరు. కన్న తల్లిదండ్రులను అనాధాశ్రమంలో.. వృద్దాశ్రమంలో వదిలేస్తున్నారు. సొంత వారికి ఎంత దూరం ఉంటే మనం అంత సేఫ్టీ అనుకునే రోజులు.. కానీ ఆయన మాత్రం తన సొంత వారు కాకున్నా.. ఎలాంటి సంబంధబంధాలు లేకున్నా నిండు మనసుతో ఆదుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మంచి మనసున్న మారాజు అంటే బాలీవుడ్ నటుడు సోనూసూద్. తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించినా ఆయన మాత్రం నిజ జీవితంలో హీరో. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరాశ్రయులను తన సొంత ఖర్చుతో వారి సొంత గూటికి చేర్చాడు.

కష్టాల్లో ఉన్నవారిని అక్కున చేర్చుకున్నారు.. వారి తిండీ, బట్ట, నీడ అన్నీ తానే చూసుకున్నాడు. తాజాగా సోనూ సూద్ మరో మంచి పని చేసి అందరి హృదయాలు గెల్చుకున్నాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల 15 నెలల వయసు కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోండగా జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

వెంటనే స్పందించిన సోనూసూద్ ముంబయిలోని హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయడానికి అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయాలను అందించి ఆపరేషన్ చేయించారు. అక్కడ ఉన్నంత వరకు కుటుంబానికి ఖర్చులు భరించాడు. చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి మునుకుళ్లకు చేరుకుంది. ఈసందర్భంగా సోనూసూద్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -