Friday, May 3, 2024
- Advertisement -

ప‌ద్మావ‌త్ సినిమా విడుద‌ల‌కు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌… ఈనెల 25న దేశ వ్యాప్తంగా విడుద‌ల‌

- Advertisement -

ప‌ద్మావ‌త్ సినిమా ర‌లీజ్ కాకముందే అనేక వివాదాస్పాదాలు మూట‌గ‌ట్టుకున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రంగం సిద్ద‌మ‌య్యింది. సినిమా రిలీజ్‌ను కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించ‌డంతో చిత్రం యూనిట్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. చివ‌ర‌కు సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ప‌ద్మావ‌త్ సినిమాకు పెద్ద ఊర‌ట క‌లిగింది.

ఈ సినిమాపై నిషేధం విధించే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జనవరి 25న దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. సీబీఎఫ్‌సీ కొన్ని షరతులతో సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్.. ‘పద్మావత్’పై నిషేధం విధించాయి. చిత్ర నిర్మాత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా జనవరి 18 ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సినిమాపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది.

పద్మావత్ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు సినిమాలు పలు మార్పులు చేసి, కొత్త ట్రైలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే.. రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు దీపికా పదుకొణె నటించిన దృశ్య కావ్యం ‘పద్మావత్‌’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. దీపిక, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ నటన అద్భుతంగా ఉందని రవిశంకర్‌ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -