Saturday, May 25, 2024
- Advertisement -

ఈ ట్రైల‌ర్ చూస్తే వాహ్ అనాల్సిందే

- Advertisement -
  • స‌స్పెన్స్‌తో కూడిన టిక్ టిక్ టిక్‌

అంత‌రిక్షంలో ప‌డితే ఎలా? అంత‌రిక్షంలో రాకెట్‌లో కూడా ఫైటింగా? భూమి మీద‌కు ఏదైనా ప్ర‌మాదం సంభ‌విస్తోందా? అంటూ ఎన్నో ప్ర‌శ్న‌లు ఆ ట్రైల‌ర్‌ను చూస్తే వ‌స్తాయి. ఈ ట్రైల‌ర్ చూస్తే వాహ్ అనాల్సినంత విష‌యం ఉంది. అదే త‌మిళ్ సినిమా టిక్ టిక్ టిక్‌. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ ట్రైల‌ర్ హాలీవుడ్ స్థాయిని మించి ఉంద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

జయం రవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అయ్యింది. భార‌త్‌లో అంత‌రిక్ష నేప‌థ్యంలో తీస్తున్న తొలి ఇది అని ప్ర‌కటించారు. పూర్తి స్థాయి అంత‌రిక్షం గురించి తీస్తున్న సినిమా ఇది. హాలీవుడ్ మాదిరి ఈ సినిమా ట్రైల‌ర్ ఉంది. భూమి పైకి అగ్నిగోళం ప‌డ‌డం.. కొంద‌రు క‌లిసి అంత‌రిక్షంలోకి వెళ్ల‌డం.. అక్క‌డ రాకెట్‌లో ఫైటింగ్‌.. రాకెల్ ప‌గిలి హీరో బ‌య‌ట‌ప‌డ‌డం.. ఇలా ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాలు ఈ ట్రైల‌ర్‌లో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు శక్తి సౌందర్ రాజన్ ఈ సినిమాను తీస్తున్నాడు. ఈ ట్రైలర్‌ ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో చర్చనీయాంశమవుతోంది. త‌మిళ సినిమానే కాదు తెలుగు, బాలీవుడ్‌లోనూ దీని గురించి చ‌ర్చించుకుంటున్నారు.

‘టిక్ టిక్ టిక్’ కథాంశం విషయానికి వస్తే తమిళనాడు ప్రాంతంలోకి ఒక ఆస్టరాయిడ్ వచ్చి పడి ఒక ప్రాంతం ధ్వంసమవుతుంది. ఐతే కొన్ని వారాల తర్వాత ఇంకో పెద్ద ఆస్టరాయిడ్ భూమి మీద పడబోతోందని.. అది పడితే భారీ నష్టం వాటిల్లుతుందని శాస్ర్త‌వేత్త‌ల‌కు తెలుస్తుంది. ఆ ఆస్టరాయిడ్‌ను ఆపడానికి ఒక రాకెట్ ప్రయోగానికి సిద్ధ‌మ‌వుతారు. అయితే ఆ రాకెట్ శత్రువుల చేతుల్లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఆ అగ్నిగోళం నుంచి భూమిని ఎలా కాపాడాడు అని స్టోరీగా తెలుస్తోంది. అతను మెజీషియన్ కమ్ ఎస్కేప్ ఆర్టిస్ట్. మరి ఈ హీరో ఆ టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నది ఈ సినిమా కథ.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -