Tuesday, April 30, 2024
- Advertisement -

తేజ మీద క్రిమినల్ కేసు, తెలుగు ఇండస్ట్రీ కి ఏమైంది ?

- Advertisement -

తెలుగు సినీ ప్రముఖులపై వరుసగా కేసులు నమోదు కావడంతో టాలీవుడ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పద నటుడు ఉదయ్ కిరణ్ పై పీడీ యాక్టు కింద కేసు నమోదైన రోజుల వ్యవధిలోనే ప్రముఖ సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు నమోదైంది. కలప వ్యాపారి ఆర్వీ కృష్ణారావు ఫిర్యాదు మేరకు తేజతో పాటు వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెం 9లో నివాసముంటున్న కృష్ణారావు – తేజల మధ్య ఓ ఇంటికి సంబంధించి వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న రాత్రి ఫిలింనగర్ ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 12 వైపు వెళుతున్న కృష్ణారావును విక్కీ అనే వ్యక్తి ఆపాడు. ఇంటికి సంబంధించి తేజతో ఉన్న వివాదాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలని సూచనలు చేసిన విక్కీ, లేని పక్షంలో వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లు చూస్తూ ఉరుకోవని హెచ్చరించాడు.

అలాగే ఈ నెల 13న తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి విక్కీ తదితరులు దూషించారు. ఈ క్రమంలో తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కృష్ణారావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తేజ సహా వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ‘చిత్రం’ సినిమాతో మొదలైన తేజ, కెరీర్ ఆరంభంలో ఒక వెలుగు వెలిగి, వరుస పరాజయాలతో ‘హోరాహోరీ’ తర్వాత కనుమరుగయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -