నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి

- Advertisement -

దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. గతంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.పెళ్లి తర్వాత చాలా రోజులకు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియమని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. బుల్లితెరపై పలు షోలను చేస్తూనే .. మరోవైపు పలు సినిమాలకి కమిట్ అవుతోంది.

ఈ క్రమంలోనే ప్రియమణి నటించిన “ది ఫ్యామిలీ మెన్” అని వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే ఎంతో విజయవంతమైన ఈ సిరీస్ లో నటించడానికి పూర్తి కారణం తన భర్తని ఈ నటి చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ కథను తీసుకొని దర్శకులు తనని కలిసినప్పుడు కథ మొత్తం విన్న తర్వాత దీనిలో నటించాలా.. వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు తన భర్త ఏమి ఆలోచించకుండా ఈ సిరీస్ లో నటించమని చెప్పినట్లు తెలిపారు.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

ఈ విధంగా తన భర్త ముస్తాఫా రాజ్‌ చెప్పడంతోనే తాను ఈ సిరీస్ లో నటించానని ఇది దేశవ్యాప్తంగా విజయవంతం కావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రియమణి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్ప సినిమాల్లో కూడా నటించారు. అలాగే దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో భాగస్వామ్యం కానుందని తెలుస్తోంది.

Also read:నేను ప్రెగ్నెంట్.. ఆయన నన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు: నటి

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -