వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి దూకుడుగా ముందుకు సాగుతున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. సైరా అంటూ వెండితెర‌పై మెరిసిన చిరు ప్ర‌స్తుతం ఆచార్య‌గా మ‌న ముందుకు రాబోతున్నారు. ఇటీవ‌లే ఆచార్య సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ స‌మ్మ‌ర్ కు మే 14న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. చిరుతో పాటు రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఆచార్య‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా, చిరు ప్ర‌స్తుతం వేద‌ళం, సూసీఫ‌ర్ సినిమాల‌ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌రో సినిమాకు కూడా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్ర‌స్తుతం మ‌ల‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్ మొద‌ట సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలో చిరుకు చెల్లిగా న‌టించ‌బోయే యాక్ట‌ర్ గురించి ఇప్ప‌టికీ అనేక మంది పేర్లు వినిపించాయి.

- Advertisement -

అయితే, లూసీఫ‌ర్ లో చిరు చెల్లి పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించ‌బోతున్నార‌ని ప్రస్తుతం టాక్ న‌డుస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్ప‌టికే ఆమెను చిత్ర యూనిట్ సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ఈ పాత్ర కోసం న‌య‌న‌తార, త్రిష‌, విజ‌య‌శాంతి, సుహాసిని లాంటి హీరోయిన్ల‌ను అడ‌గ్గా వారు నో చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఈ పాత్ర చేయ‌డానికి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఒప్పుకుంటుందో? లేదో చూడాలి మ‌రి.. !

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

సమ్మర్ స్పెషల్: సోంపు గింజల కూల్ డ్రింక్.. ప్రయోజనాలెన్నో !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -