నారప్ప డైరెక్టర్​తో వెంకీ, కమల్​ మల్టీ స్టారర్​..!

- Advertisement -

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘నారప్ప’ ఇటీవల అమెజాన్​ ప్రైమ్​లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అసురన్​ను చిత్రాన్ని ఉన్నదున్నట్టు దించేశారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికి ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. వెంకీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే.

అయితే అసురన్​ లాంటి ఒక ప్రత్యేక చిత్రాన్ని రీమేక్​ తీయాలని భావించినప్పుడే.. శ్రీకాంత్​ అడ్డాల కూడా విభిన్నకథల కోసం ట్రై చేస్తున్నాడని అంతా భావించారు.ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ మల్టీస్టారర్​ సినిమా ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కథను కూడా సిద్ధం చేసుకున్నాడట. విశ్వ నటుడు కమల్ హాసన్​, విక్టరీ వెంకటేశ్​తో ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని శ్రీకాంత్​ భావిస్తున్నాడట.

గతంలో వెంకటేశ్​, కమల్ హాసన్ నటించిన ఈనాడు చిత్రం మంచి పేరు తెచ్చుకున్నది. మరోసారి వీళ్లిద్దరూ కలవబోతున్నట్టు టాక్​. శ్రీకాంత్​ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్​ ఓ బడా ప్రొడ్యూసర్​కు కూడా నచ్చిందట. ఇక వెంకటేశ్​, కమల్​ ఒప్పుకుంటే ఈ మూవీ తొందర్లోనే పట్టాలెక్కే చాన్స్ ఉంది. నిజానికి శ్రీకాంత్​ అడ్డాల.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తయిన వెంబడే.. ఈ మల్టీ స్టారర్​ ప్లాన్​ చేశాడట. అయితే వివిధ కారణాలతో అప్పట్లో ఈ మూవీ ఆగిపోయింది. మొత్తానికి నారప్పతో సక్సెస్​ కొట్టిన శ్రీకాంత్​ అడ్డాల స్పీడు మీద దూసుకెళ్తున్నాడు.

Also Read

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్​ సాంగ్ లో రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణ..!

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -