Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి

- Advertisement -

దేశంలో కరోనా తీవ్రత ఘోరంగా పెరిగిపోతుంది. కరోనాతో ఎంతో మంది చనిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు కరోనాతో కన్నుమూస్తున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో కరోనా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ గాయకుడు జి.ఆనంద్ (67) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్‌ లభించకపోవడంతో ఆనంద్‌ మృత్యువాత పడినట్లు తెలిసింది.

జి.ఆనంద్ ది శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం… ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. జి.ఆనంద్ పాడిన ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’,‘విఠలా విఠలా పాండురంగ విఠలా’వంటి అనేక పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.

కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’, చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. ‘గాంధీనగర్‌ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఆనంద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

నేటి పంచాంగం, శుక్రవారం (07-08-2021)

తెలంగాణలో నో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -